KCR: వలసలు పోయే పాలమూరులో ఇప్పుడు అద్భుత ఫలితాలు - కేసీఆర్
కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఒకప్పుడు పాలమూరు ప్రజలు ముంబయి బస్సులను పట్టుకొని వలస పోయేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయి అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు. కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోభివృద్ధిలో భాగం అయిన ప్రభుత్వ అధికారులను అభినందించారు.
తెలంగాణ అన్ని రంగాల్లో డెవలప్ అవుతోందని దేశంలో ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ వారికి వస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పురోగతిపై ఇటీవల నాస్‌కామ్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. భారత దేశంలో ఐటీ సెక్టార్‌లో 50 శాతం ఉద్యోగాలు తెలంగాణలోనే వస్తున్నాయని కేసీఆర్ అన్నారు.
‘‘గతంలో వలసలు, కరవుకు నిలయంగా పాలమూరు ఉండేది. ప్రస్తుతం పాలమూరులో అద్భుతాలు చూస్తున్నాం. కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. నాగర్ కర్నూలులో ఘనంగా 19వ కలెక్టరేట్‌ను ప్రారంభించుకున్నాం.. త్వరలో గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లు కూడా పూర్తి అవుతాయి. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం’’ అని అన్నారు.
‘‘గతంలో వలసలు, కరవుకు నిలయంగా పాలమూరు ఉండేది. ప్రస్తుతం పాలమూరులో అద్భుతాలు చూస్తున్నాం. కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. నాగర్ కర్నూలులో ఘనంగా 19వ కలెక్టరేట్‌ను ప్రారంభించుకున్నాం.. త్వరలో గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లు కూడా పూర్తి అవుతాయి. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ఇక్కడ ఉన్నారు. ఉద్వేగంతో చాలా గొప్పగా పాటలు రాశారు. వాగు ఎండిపాయేరా, పెద్ద వాగు ఎండిపాయేరా అని వెంకన్న పాటలు రాశారు. దుందుభి నది ఎలా కొట్టుకుపోయిందో వారు పాటలో చెప్పారు. హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు ఆ వాగు మీద కట్టిన చెక్ డ్యామ్‌లు, నీటిని చూసి ఆనందించిపోయాం. నేను, జయశంకర్ సార్ కలిసి తిరుగుతుంటే.. పాలమూరు కరువు గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి’’ అని కేసీఆర్ తెలిపారు.
కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
నాగర్ కర్నూల్ పట్టణంలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సహా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం (జూన్ 6) ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి నమస్కరించారు. రూ.52 కోట్లతో జిల్లా కలెక్టరేట్ నిర్మించగా, రూ.35 కోట్లతో పోలీసు భవన సముదాయాలు నిర్మించారు. ఈ ప్రారంభోత్సవాల తర్వాత వెలమ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఆ సభలోనే ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.