CJI NV Ramana: నా కల సాకారం చేశారు.. సీఎం కేసీఆర్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ కేంద్రం డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు చొరవ చూపిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు సీజే నివాసంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైందన్న ఆయన... దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని గుర్తుచేశారు.
వివాదాలు త్వరగా పరిష్కారం
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సీజేఐ జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారన్న ఆయన.. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారన్నారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైందని తెలిపారు. దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్ కేంద్రం ఉందన్నారు. ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని స్పష్టంచేశారు. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారన్నారు.
Also Read : Ramana Ramana : వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?
3 నెలల్లో కల సాకారం
ఆర్బిట్రేషన్ కేంద్రానికి మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నానని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. వీలైనంత త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరపాలని కోరారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన కోరిక అని అన్నారు. 3 నెలల క్రితం చేసిన ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ సత్వరమే స్పందించారన్నారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటుచేయాలన్న తన కల సాకారానికి కృషి చేస్తున్న కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : AP BJP : జగన్‌తో కిషన్ భేటీపై ఏపీ బీజేపీ నేతల్లో కలవరం ఎందుకు..?
Also Read: China Approves Three-Child Policy: ఇక ముగ్గురిని కనేయొచ్చు.. అంతేకాదు ఇంకో బంపర్ ఆఫర్ కూడా!