అన్వేషించండి

Chicken Price Hike May 2026: చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!

Skinless Chicken Rate: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ధర రికార్డు స్థాయికి చేరింది. ఎండల తీవ్రత, సరఫరా కొరత వల్లే ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది.

Chicken Rate in Hyderabad Today:  తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తాపం ఒకవైపు, వేడుకల సీజన్ మరోవైపు వెరసి చికెన్ రేట్లకు రెక్కలొచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే మాంసాహారం కాస్తా ఇప్పుడు  ప్రీమియం ఐటమ్‌గా మారిపోయింది.  

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. కిలో చికెన్ ధర సాధారణంగా రూ. 200 నుండి రూ. 220 మధ్య ఉండాల్సింది పోయి, ప్రస్తుతం  రూ. 320 నుండి రూ. 380   వరకు  స్కిన్‌లెస్ పలుకుతోంది. కొన్ని చోట్ల నాటు కోడి ధరలు కిలోకు రూ. 800 వరకు చేరాయి.  ఈ అకస్మాత్తు పెరుగుదల మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

 ఎందుకు పెరుగుతున్నాయి?  

1.  ఎండల తీవ్రత : మే నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకోవడంతో కోళ్లు వేడిని తట్టుకోలేక మరణిస్తున్నాయి  . దీంతో పౌల్ట్రీ ఫారాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది.
2.  ఫీడ్ ఖర్చులు: కోళ్లకు పెట్టే మేత  మొక్కజొన్న, సోయా  ధరలు పెరగడం వల్ల నిర్వహణ ఖర్చు భారమై, రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు.
3. పెళ్లిళ్ల సీజన్:  ప్రస్తుతం ముహూర్తాల సీజన్ కావడంతో ఫంక్షన్ హాల్స్, హోటళ్ల నుండి ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి, సప్లై తక్కువగా ఉండటంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

 సరఫరా కొరత - డిమాండ్ పెరుగుదల 

తెలంగాణలో రోజుకు సగటున 11 లక్షల కిలోల చికెన్ వినియోగం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎండల వల్ల కోళ్లు బరువు తూగకపోవడం 1.5 కిలోలకే పరిమితమవడం  వల్ల మార్కెట్లోకి తక్కువ మాంసం వస్తోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా హైదరాబాద్ మార్కెట్‌కు కోళ్ల సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు మరో కారణం.
 
గ్యాస్ సిలిండర్, నూనె ధరలు ఇప్పటికే భారంగా మారాయి. ఇప్పుడు చికెన్ కూడా కిలో రూ. 400 కి చేరువలో ఉండటంతో  ముక్క లేనిదే ముద్ద దిగని సామాన్యుడికి ఇది పెద్ద దెబ్బ  అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
LB Nagar Police Constable Suicide: ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget