అన్వేషించండి

Temple Demolition Fact Check: 800 ఏళ్ల ఆలయం కూల్చివేత వార్తల్లో వాస్తవం లేదు- వరంగల్ జిల్లా కలెక్టరేట్ క్లారిటీ

వరంగల్ జిల్లా పహాడ్ల అశోక్ నగర్‌లో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, శిథిలావస్థలో ఉన్న ఆ నిర్మాణాన్ని అదే స్థలంలో పునరుద్ధరిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పహాడ్ల అశోక్‌ నగర్‌లో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. మే 6వ తేదీన కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు రెవెన్యూ, పురావస్తు శాఖ (Archaeology), TGEWIDC, సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విచారణ చేపట్టారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని శుభ్రం చేస్తుండగా, దట్టమైన పొదల్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని నిర్మాణ అవశేషాలు బయటపడ్డాయి. అయితే, ఆ నిర్మాణాలను కూల్చివేసినట్లుగానీ, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి మాత్రమేనని, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.


Temple Demolition Fact Check: 800 ఏళ్ల ఆలయం కూల్చివేత వార్తల్లో వాస్తవం లేదు- వరంగల్ జిల్లా కలెక్టరేట్ క్లారిటీ

పురావస్తు శాఖ అధికారులు ఈ కట్టడాన్ని పరిశీలించి, ఇది రక్షిత దేవాలయం కాదని మరియు పురావస్తు కట్టడాల జాబితాలో నమోదు కాలేదని తేల్చారు. కలెక్టర్ మరియు నర్సంపేట ఎమ్మెల్యే సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి, ఆ నిర్మాణానికి పురావస్తు శాఖ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చరిత్రకారుల సలహాలతో ఆ నిర్మాణాన్ని అదే ప్రదేశంలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు అధికారికంగా ధ్రువీకరించుకోవాలని మీడియాకు, ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో ఏం పోస్టులు చేశారంటే..

సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేశారని తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్‌తో కూల్చడం అన్యాయం అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. 

వరంగల్ జిల్లాలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసంపై కేంద్రం సీరియస్ అయిందని, దాంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పురావస్తు విభాగం కేసు నమోదు చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ స్పందించిందని, 1965లోనే ఈ ఆలయ శాసనాలను హెరిటేజ్ శాఖ నమోదు చేశారని.. తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Embed widget