అన్వేషించండి

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు

AP CM Chandrababu | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు.

అమరావతి : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేని కారణంగా పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. బీజేపీ తమ మద్ధతు కోరితే ఆలోచిస్తామన్నారు చంద్రబాబు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.

తెలంగాణ నేతలతో చంద్రబాబు కీలక భేటీ 

తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో  మంగళగిరిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ బలోపేతంలో భాగంగా రెండు మూడు రోజుల్లో 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తరువాత పార్లమెంట్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు. 


Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు

పార్టీని యాక్టివ్ చేయాలని కోరిన నేతలు

తెలంగాణలో టీడీపీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి... గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్ గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర నాయకులు చంద్రబాబుకు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ లోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని  కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు త్వరలోనే కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కంభంపాటి రమ్మోహన్, నందమూరి సుహాసిని, ఆశోక్ గౌడ్, జోత్స్న, పోగాకు జైరామ్, వాసిరెడ్డి రామనాధంతో పాటు పలువురు హాజరయ్యారు.


Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం, తేల్చేసిన చంద్రబాబు

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget