అన్వేషించండి

Power Bill Protests : విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల సమ్మె, కేంద్రమంత్రుల ఆఫీసులకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు!

Power Bill Protests : కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించారు.

Power Bill Protests : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద సోమవారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

తెలంగాణలో మహా ధర్నా 

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో వినియోగదారులకే తీవ్ర నష్టమని తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే పూర్తిగా విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లుతో అనేక సమస్యలు వస్తాయని, అసలు విద్యుత్‌ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు సిద్ధమవుతోందంటూ ఆరోపించారు. 

కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం 

నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా జనరేటింగ్‌ స్టేషన్లు, సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నారు. కేంద్రం చట్ట సవరణ పేరుతో డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు విద్యుత్ ఉద్యోగుల ఉద్యమంలో ప్రజలు సహకరించాలన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టంచేశారు.  

సమ్మెలో 27 లక్షల మంది ఉద్యోగులు 

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.  తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. అయితే ఈ సమ్మె వినియోగదారులపై ప్రభావం చూపనుంది. కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో విద్యుత్తు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘాలు ఇవాళ్టి నుంచి మహా ధర్నా చేపట్టాయి. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ సంస్థలను పారిశ్రామివేత్తలకు కట్టబెట్టేందుకు ఈ బిల్లు పెడుతున్నారని మండిపడుతున్నాయి. కేంద్రం తెస్తున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ 12 రాష్ట్రాలు తీర్మానం చేశాయి. కేంద్రం పార్లమెంట్‌లో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడితే నిరసనలు మరింత తీవ్రం చేస్తామని విద్యుత్‌ సంఘాల నేతలు హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. అవసరమైతే బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్రమంత్రుల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

Also Read : CM KCR : మహాత్ముడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం - సీఎం కేసీఆర్

Also Read : Rajagopal Reddy Comments: టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఆ మంత్రులు ఉద్యమంలో పాల్గొన్నారా ?: రాజగోపాల్ రెడ్డి

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget