అన్వేషించండి

Telangana News: రూ.1800 కోట్ల భారీ స్కాం - సాహితీ ఇన్ ఫ్రా టెక్ పై 50 కేసులు నమోదు, సీసీఎస్ దర్యాప్తు ముమ్మరం

Sahiti Infra Case: కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రీ లాంచ్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ ఫ్రాపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ స్కామ్ మొత్తం రూ.1800 కోట్లుగా తేల్చారు.

CCS Police Investigation on Sahiti Infra Case: ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిందన్న అభియోగాలతో సాహితీ ఇన్ ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై (Sahiti Infra) సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ స్కామ్ మొత్తం రూ.1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. ఇప్పటివరకూ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ సహా 22 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 50 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 2019 - 22 మధ్య పలు ప్రాజెక్టుల పేరుతో కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.

9 ప్రాజెక్టుల పేరుతో

  • సాహితీ ఇన్ ఫ్రా సంస్థ 9 ప్రాజెక్టుల పేరుతో కస్టమర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. నానక్ రాంగూడలో సాహితీ స్వద కమర్షియల్ పేరుతో 69 మంది నుంచి రూ.65 కోట్లు.
  • మేడ్చల్ - కొంపల్లి షిస్టా అబోద్ పేరుతో 248 మంది నుంచి రూ.79 కోట్లు, కొంపల్లిలో సాహితీ గ్రీన్ పేరుతో 153 మంది నుంచి రూ.40 కోట్లు వసూలు చేసింది.
  • గచ్చిబౌలిలోని సాహితీ సితార పేరుతో 269 మంది వద్ద రూ.135 కోట్లు, బంజారాహిల్స్ లో సాహితీ మహెటో సెంట్రో పేరుతో 44 మంది నుంచి రూ.22 కోట్లు దండుకుంది.
  • నిజాంపేటలో ఆనంద్ ఫార్చూన్ పేరుతో రూ.40.50 కోట్లు, మోకిలాలో సాహితీ సుదీక్ష పేరుతో రూ.22 కోట్లు, బాచుపల్లిలో రూబీకాన్ పేరుతో 43 మంది నుంచి రూ.6.9 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదీ జరిగింది

23 ఎకరాల్లో 38 అంతస్తుల అపార్ట్ మెంట్ నిర్మాణం పేరుతో సాహితీ ఇన్ ఫ్రా సంస్థ వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. డబుల్, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ల ఫ్లాట్లు ఉంటాయని నమ్మబలికారు. మంచి ఎమినిటీస్‌తో తక్కువ ధరకే ఇస్తామని అందర్నీ ఆకర్షించారు. అయితే, డబ్బులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా.. ఎలాంటి ప్రాజెక్టులు మొదలు పెట్టకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముందే డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. మరో ప్రాజెక్టులోనూ 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేసినట్లు వరుస ఫిర్యాదులు అందాయి. అంతకు ముందు ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఆలస్యంగా తెలుసుకున్న కస్టమర్లు.. తమ డబ్బులు తిరిగిచ్చేయాలని సంస్థ ఎండీ లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. ఏడాదికి 15 నుంచి 18 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికి, కొందరికి చెక్స్‌ కూడా ఇచ్చారు. కానీ ఆ చెక్స్‌ను బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. దీంతో వినియోగదారులంతా తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడ్డ సంస్థ ఎండీ ఆ డబ్బును వివిధ ప్రాజెక్టుల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. నగదును అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. దీనిపై ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల విచారణ సాగుతోంది.

Also Read: Sangareddy: సంగారెడ్డి జిల్లాలో విషాదం - నిర్మాణంలోని చర్చి కూలి ఒకరు మృతి, ముగ్గురు పరిస్థితి విషమం


    సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహిర్ (Kohir) లో ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా చెక్కలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget