By: ABP Desam | Updated at : 06 Dec 2022 05:27 PM (IST)
11వ తేదీన వస్తాం - కవితకు సీబీఐ రిప్లై !
CBI Kavita : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11వ తేదీన సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద వివరణ తీసుకోనున్నారు. ఆరోతేదీన వస్తామన్న సీబీఐ అధికారులు ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు రాలేదు. ఆరో తేదీన విచారణకు సహకరించాలని గత వారం కవితకు సీబీఐ అధికారులు లేఖ రాశారు. ఢిల్లీలో లేదా హైదరాబాద్‌లో అయినా పర్వాలేదన్నారు. ఆ లేఖను స్పందించిన కల్వకుంట్ల కవిత ఆరో తేదీన తన ఇంట్లో అందుబాటులో ఉంటానని సమాధానం ఇచ్చారు. అయితే తర్వాత న్యాయనిపుణులు, తన తండ్రి సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత వ్యూహం మార్చుకున్నారు. తనకు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. వాటిని సీబీఐ వెబ్ సైట్‌లో ఉంచినట్లుగా సమాచారం రావడంతో ... పరిశీలించి...అందులో నిందితురాలిగా తన పేరు లేదని.. అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని చెప్పారు.
డిసెంబర్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంలో వివరణ తీసుకోవడానికి వస్తామని కవితకు సీబీఐ లేఖ
కానీ ఆరో తేదీన అందుబాటులో ఉండనని చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని లేఖ రాశారు. కానీ ఆ లేఖకు సీబీఐ నుంచి ఆరో తేదీన సాయంత్రం వరకూ స్పందన రాలేదు. మరో వైపు అధికారులు కూడా రాకపోవడంతో ఈ అంశంపై కవిత న్యాయనిపుణులతో సంప్రందిపులు జరిపారు. అయితే ఆరో తేదీ సాయంత్రానికి సీబీఐ నుంచి రిప్లయ్ వచ్చింది. 11వ తేదీన అందబాటులో ఉండాలని ఆ రిప్లైలో సీబీఐ అదికారులు కోరారు.
సీబీఐ అధికారుల వ్యూహంపై న్యాయనిపుణులతో కవిత మంతనాలు
ఈ అంశంపై టీఆర్ఎస్ తరపున న్యాయనిపుణులు తర్వాత ఏం జరగొచ్చో అన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే సీబీఐ ఇచ్చిన నోటీసు ప్రకారం ఆమెను సాక్షిగానే పిలుస్తున్నారు. ఫిర్యాదులో కానీ.. ఎఫ్ఐఆర్‌లో కానీ ఆమె పేరు లేదు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను టార్గెట్ చేసి.. తీవ్ర ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా వారు వాదిస్తున్నారు. అందుకే ఆ దిశగానే ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఫిర్యాదులో కానీ .. ఎఫ్ఐఆర్‌లో కానీ కవిత పేరు లేదు. అయితే జరుగుతున్న రాజకీయం మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క సారిగా వ్యూహం మారుస్తాయని.. కవితను నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్ తరపున న్యాయనిపుణులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు.
కవిత రాసిన లేఖకు ఆలస్యంగా స్పందించిన సీబీఐ అధికారులు
కవిత రాసిన లేఖకు సీబీఐ అధికారులు స్పందిస్తారని.. ఆమె ఇచ్చిన తేదీల్లో ఏదో ఓ రోజు వస్తామని.. ఎప్పుడైనా సమాచారం పంపవచ్చని సీబీఐ వ్యవహారాలపై అవగాహన ఉన్న నిపుణులు అంచనా వేశారు. దాని ప్రకారం.. పదకొండో తేదీన వారు వివరణ తీసుకోవడానికి సిద్ధమని సమాచారం పంపారు. ఇలా విచారణలు వాయిదా అడగడం సహజమేనని.. పైగా కవిత పూర్తిగా సాక్షి కోణంలోనే నోటీసులు జారీ చేశారని అంటున్నారు.
ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు
Himanshu Heads CAsnival : ఈ కాస్నివాల్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి, ఈవెంట్ డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువు పునరుద్ధరణ- హిమాన్షు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!