అన్వేషించండి

Free Ration: దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త, మరో ఏడాదిపాటు ఉచిత రేషన్‌ - కేబినెట్ కీలక నిర్ణయం

Free Ration in India: దేశ ప్రజలకు మరో ఏడాదిపాటు దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది.  

Free Ration న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఏడాదిపాటు దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది.  జాతీయ ఆహార భద్రతా చట్టం (National Food Security Act) కింద 81.3 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారం ఎంతంటే ! 
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ను ఉచితంగా అందించడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒక్క రూపాయి సైతం చెల్లించకుండా డిసెంబర్ 2023 వరకు ఉచితంగా 81.3 కోట్ల మందికి రేషన్ అందిస్తామని చెప్పారు. ఆహార చట్టంగా వ్యవహరించే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, ప్రభుత్వం ప్రస్తుతం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను కిలోకు రూ. 2 నుంచి 3 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే అంత్యోదయ అన్న యోజన (Antyodaya Anna Yojana) కింద ఉన్న కుటుంబాలకు ప్రతినెలా 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం పేదలకు రూ.3కు కిలో బియ్యం, కిలో రూ.2కే గోధుమలు చొప్పున పంపిణీ జరుగుతోంది.

న్యూ ఇయర్ గిఫ్ట్.. కేంద్ర మంత్రి 
కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం కింద ఉచిత రేషన్ అందించడానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ తాజా నిర్ణయంతో కేంద్రం ఖజానాకు ఈ సమయంలో సుమారు రూ. 2 లక్షల కోట్లు భారం ఉంటుందని అంచనా వేశారు. కాగా, డిసెంబర్ 31తో ముగియనున్న ఉచిత రేషన్ పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ని పొడిగించకూడదని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. "దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర కానుక"గా పీయూష్ గోయల్ అభివర్ణించారు. 

జూలై 1, 2019 నుంచి సాయుధ బలగాల పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల పింఛన్‌ను వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) కింద సవరించడానికి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం వల్ల 25.13 లక్షల మంది వెటరన్స్‌ ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశం‌లో తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget