అన్వేషించండి

KTR News: యూకే పర్యటన ముగించుకుని, డల్లాస్‌ చేరుకున్నకేటీఆర్- బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరు

KTR London Tour | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండర్ పర్యటన ముగించుకుని అమెరికాకు చేరుకున్నారు. డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొననున్నారు.

LTR US Tour | డల్లాస్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) యూకే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ విజయగాథను అద్భుతంగా వినిపించారు. అధికారం కంటే పుట్టిన గడ్డ మీదనే తనకు మమకారం ఉంటుందని ఈ పర్యటనలో చాటారు. మే 27న యూకేలో అడుగుపెట్టిన కేటీఆర్ కు తెలంగాణ ఎన్.ఆర్.ఐలు ఘన స్వాగతం పలికారు. వారంతా కేటీఆర్ మాస్కులు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కార్యకర్తలకు అండగా నిలిచిన కేటీఆర్

గుండె సంబంధిత ఆపరేషన్ తరువాత కోలుకుంటున్న బీఆర్ఎస్ (BRS) ఎన్నారై నాయకుడు, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ అనిల్ ఇంటికి ఏయిర్ పోర్ట్ నుంచే నేరుగా వెళ్లి కేటీఆర్ పరామర్శించారు. మలిదశ ఉద్యమంలో దశాబ్దకాలం కాలం పాటు ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ వాదాన్ని వినిపించిన అనిల్ ను ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్న సందేశాన్ని కేటీఆర్ ఇచ్చారు. 

మే 28 తేదిన బీఆర్ఎస్ ఎన్నారై కార్యవర్గం, సీనియర్ నేతలతో లండన్ లో సమావేశమైన కేటీఆర్ (KTR)… పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన చర్చించారు. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణ వాదానికి ప్రతీకగా నిలిచారని ఎన్.ఆర్.ఐ (UK)విభాగాన్ని ప్రశంసించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని మెచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి, మోసాలను సోషల్ మీడియాలో బలంగా ఎత్తిచూపాలన్నారు. అక్కడి ఎన్.ఆర్.ఐ నేతలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్, యూకేలో బీఆర్ఎస్ రజోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఓకే చెప్పారు. 

యూకే నుంచి పెట్టుబడులకు ఆహ్వానం

అదే రోజు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి సహకారం అందించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసమే తాము పాటు పడుతామన్నారు. కోట్లాది మంది దశాబ్దాల స్వప్నాన్ని నిజం చేసిన తమకు తెలంగాణపై ఉండే ప్రేమ, అభిమానం మరెవరికీ ఉండవని చాటి చెప్పారు. 

ఇక 30 న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో మెయిన్ స్పీచ్ ఇచ్చిన కేటీఆర్ ,ఆర్థిక రంగాన్ని స్థిరమైన వృద్ధితో నడిపించడంలో ప్రపంచానికి తెలంగాణ ఎలా దిక్సూచీగా మారిందో అద్భుతంగా వివరించారు. సీఎంగా కేసీఆర్ హయాంలో తమ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ రంగాల్లో అనుసరించిన విప్లవాత్మక పంథాను  గణాంకాలతో సహా వివరించి, వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలును పంచుకున్నారు.  సంపదను సృష్టించి దాన్ని పేదలకు సమానంగా పంచడమే తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిన విషయాన్ని కేటీఆర్ హైలెట్ చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్, తెలంగాణను ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

పీడీఎస్‌ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్

మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే  పీడీఎస్‌ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ ను వార్విక్ యూనివర్సిటీ లో మే 31 నాడు కేటీఆర్ ప్రారంభించారు. దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీీ గర్వకారణం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పూణే,చెన్నై తరువాత హైదరాబాద్ ఎలా ఆటోమోటివ్ హబ్ గా మారిందో వివరించారు. పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. 

యూకే పర్యటన ముగించుకొని అమెరికాలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అమెరికాలోని డల్లాస్ కి చేరుకున్నారు కేటీఆర్. 3 రోజుల యూకే పర్యటనలో అనేకమంది ఎన్నారైలు కేటీఆర్ ని కలిశారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. యూకే పర్యటన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విభాగం అద్భుతంగా పనిచేస్తుందని పార్టీ చేస్తున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget