అన్వేషించండి

Tollywood Politics: ఒక్క వారంలో మారిన సీన్, టాలీవుడ్ తో వివాదంలో ఏపీ ప్రభుత్వం - దగ్గరవుతున్న తెలంగాణ సర్కార్

Gaddar Awards | ఒక్క వారంలో తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ తో రిలేషన్ పూర్తిగా మారిపోయింది. సన్నిహితులు అనుకున్న ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కు దూరం కాగా, అదే సమయంలో తెలంగాణ సర్కార్ వారికి దగ్గరైంది.

Gaddar Movie Awards | మీరు సరిగ్గా గమనిస్తే ఒక్క వారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు  టాలీవుడ్ తో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పు క్లియర్ గా కనబడుతుంది. టాలీవుడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే  కూటమి ప్రభుత్వం  ప్రస్తుతం థియేటర్ల ఇష్యూ లో నిర్మాతలతో గ్యాప్ తెచ్చుకుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల ప్రకటన తో దగ్గరయ్యే పనిలో పడింది. తెలుగు ప్రజలకు సినిమాతో అవినాభావ సంబంధం ఉంది.

హీరోలకు అతిపెద్ద ఫాలోయింగ్ ఆంధ్ర ప్రాంతంలో ఉంటే కలెక్షన్ల పరంగా నైజాం ప్రాంతం ముందు వరుసలో ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడూ సినీ ప్రపంచంతో దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి. అలాగే టాలీవుడ్ కూడా ప్రభుత్వం గుడ్ లక్స్ లో ఉండేందుకు తాపత్రయపడుతుంది. రిలీజ్ టైం లో టికెట్ ధరలు పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేక సినిమాలకు ట్యాక్స్ బెనిఫిట్ పొందడానికి  ముఖ్యమంత్రుల  పర్మిషన్ తప్పనిసరి కావడంతో బడా హీరోలు పెద్ద నిర్మాతలు ప్రభుత్వాలతో వివాదం కొనితెచ్చుకునే ప్రయత్నం చేయరు. కానీ గడిచిన వారంలో అనూహ్య పరిస్థితులు టాలీవుడ్ లో ఒక గందరగోళ ఎట్మాస్పియర్ని  క్రియేట్ చేశాయి. 

థియేటర్ల ఇష్యూ లో పవన్ సీరియస్ 
 ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా "హరిహర వీరమల్లు " ను అడ్డుకోవడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ లోని కొందరు నిర్మాతలు కావాలనే థియేటర్ల బంద్ ఇష్యు తెరపైకి తెచ్చి తనకు ఇబ్బంది కలుగ చేస్తున్నారని  సినిమా హాళ్ల కేటాయింపు వెనక ఉన్నది "ఆ నలుగురు నిర్మాతలు " అంటూ  అనుమానం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రెస్ మీట్ లు పెట్టి అల్లు అరవింద్, 'దిల్ 'రాజు అలాంటివాళ్లు తమకు ఈ గొడవకు సంబంధం లేదన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్  ఏపీ లోని థియేటర్లలో సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై  దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ కూడా  జనసేన చేతుల్లోనే ఉండడంతో  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని మంచి చేసుకునే పనిలో టాలీవుడ్ బడా బాబులు పడ్డారు. అయితే ఆర్ నారాయణ మూర్తి లాంటి కొందరు ప్రముఖులు మాత్రం పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక సినీ రంగానికి ఎప్పుడు దగ్గరగా ఉండే టీడీపీ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. దానితో అసలు ఈ వివాదం ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది అంటూ టాలీవుడ్ ఎదురుచూస్తుంది. ఏదేమైనా సినీ ప్రపంచంతో దగ్గరగా ఉండే  ఏపీలోని కూటమి ప్రభుత్వంతో ఇలాంటి వివాదం రావడం టాలీవుడ్ కి మింగుడు పడడం లేదు.

టాలివుడ్ కి దగ్గరగా  రేవంత్ సర్కార్ 

 "పుష్ప 2" సినిమా విడుదల సమయంలో జరిగిన పరిణామాలు  ఎంతటి సంచలన సృష్టించాయో అందరికి తెలిసిందే. ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట జరగడం ఒక మహిళ మృతి చెందడం దానికి కారణం అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షో కి వెళ్లడం అంటూ ఆయన్ని ఒకరోజు జైల్లో పెట్టడం  దేశవ్యాప్తంగా  వివాదాస్పదమైన  అంశాలతో టాలీవుడ్ పట్ల రేవంత్ సర్కార్ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుంది అన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి గ్యాప్ ఏది లేదని  తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డులతో తేలిపోయింది. ముఖ్యంగా "పుష్ప 2" లో నటనకు అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ నుంచి స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ కు కూడా అవార్డు లభించింది. ఒకేసారి పదేళ్ల పెండింగ్ అవార్డు లు ప్రకటించడం తో దాదాపు టాలీవుడ్ లోని అగ్రహీరోలు ఏదో ఒక క్యాటగిరిలో అవార్డు పొందారు. ఇది కచ్చితంగా రేవంత్ సర్కార్ తో టాలీవుడ్ కి సంబంధాలు మరింత పెరుగుపడే విషయమే.

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించే  వ్యవస్థగా మారిన టాలీవుడ్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం అలాగే ప్రభుత్వాలకు టాలీవుడ్ నుంచి లభించే  ఆదాయం రెండూ ముఖ్యమే. అయితే ఇందులో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉండేది అని ఒక అభిప్రాయం మొన్నటి వరకు ఉండేది. లేనిపోని వివాదాల నడుమ టాలీవుడ్ తో  ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సత్సంబంధాల వైఖరి కుడి ఎడమయింది. మరి వీలైనంత త్వరగా ఈ థియేటర్ల వివాదం కూడా ముగిసిపోయి ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ల స్నేహం కూడా  ఒకప్పటి స్థితికి వెళ్లాలని సినీ ప్రపంచం కోరుకుంటుంది

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget