అన్వేషించండి

KTR News: తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు, బీజేపీలో చేరనున్న సీఎం - కేటీఅర్ కీలక వ్యాఖ్యలు

Telangana Politics: ఆదిలాబాద్ లో జరిగిన పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రానున్నాయని కేటీఆర్ అన్నారు.

Adilabad News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రానున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రే బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర చేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తరపున పని చేస్తున్నారో, ప్రధాని మోదీ తరపున పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

బూత్ స్థాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబి జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు పార్టీని వీడినా.. ఎటువంటి ప్రమాదం లేదని, పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. ఉద్యమ సమయంలోనూ కార్యకర్తలే పార్టీ వెన్నంటి నడిచిన విషయాన్నీ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి వంద రోజుల్లోనే వాటిని నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం వాటి అమలులో నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని మండిపడ్డారు. 

రెండు లక్షల రుణ మాఫీపై తాజాగా ముఖ్యమంత్రి కొత్త కథ చెప్తున్నారని అన్నారు. విద్యుత్తు, సాగునీరు, రైతుబంధు సహాయం, పంటల కొనుగోలు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతన్నలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, ప్రస్తుతం వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల కాలంలో రైతుబందు ఆర్ధిక సహాయం కింద 70 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే కరవు తీసుకువచ్చిందని, కరెంటు, మంచినీటి వసతి లేక తిరిగి పాత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. పదేళ్ళలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు. 

ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గ్రామాల్లో ఈ విషయాలపై చర్చించిన బాధ్యత శ్రేనులపై ఉందని సూచించారు. గెలిచిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటపై నిలబడాలని అన్నారు. గతంలో టెట్ పరీక్షకు నాలుగు వందల ఫీజు ఉంటే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుతం రెండు వేల ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. 

అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు చేసిందేమీ లేదని, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్, సీసీఐ పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేసిన పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేసిన వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలని, బీజేపీలో బడా నేతలను ఓడించింది బీఆర్ఎస్ అభ్యర్థులేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానిని బడే భాయ్ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారని అన్నారు. 

రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందన్నారు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదన్న ఆయన...  కార్యకర్తల్లో పోరాట పటిమ తగ్గలేదని, గ్రామాల్లో ఇప్పటికీ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గ్రామగ్రామాన గులాబి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి బీజేపీ తోనే అసలు ప్రమాదం పొంచి ఉందని, తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటూ ఆ పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో వినబడాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రజల కోసం బీఅర్ఎస్ నిరంతర పోరాటం సాగిస్తుందని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Embed widget