అన్వేషించండి

Telangana Formation Day: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, 3 రోజుల సంబరాలకు కేసీఆర్ పిలుపు

Telangana Formation Day Celebrations for 3 days: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఉద్యమ నేత కేసీఆర్ 3 రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలకు పిలుపునిచ్చారు.

BRS Telangana Formation Day Celebrations for 3 days | హైదరాబాద్: జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానుంది. తెలంగాణ ఏర్పడి దశాబ్దం కావొస్తున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో 3 రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరగనుంది. ఈ మేరకు కార్యక్రమాల షెడ్యూల్ సైతం సోమవారం నాడు (మే 27న) విడుదల చేశారు.


జూన్ 1 : తొలిరోజు
గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద అమర జ్యోతి వరకు జూన్ ఒకటవ తేదీన సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి, ఘన నివాళి అర్పించనున్నారు.

జూన్ 2 : రెండో రోజు
ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావమై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకల సభ నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సభ జరుగనున్నది. హైదరాబాద్ నగరంలో పలు హాస్పిటల్స్, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయనున్నారు.

జూన్ 3: మూడో రోజు
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథ శరణాలయాల్లో స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు.

6 దశాబ్దాల కల సాకారం చేసిన కేసీఆర్!
ఉద్యమ నేతగా తన ప్రాణాలు ఎదురొడ్డి, ఆమరణ దీక్ష సైతం చేసి 6 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారు కేసీఆర్. 
తెలంగాణ సాధించి, తొట్ట తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాలన అందించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు  గులాబీ బాస్ కేసీఆర్ పిలుపునిచ్చారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా brs కార్యకర్తలు, పార్టీ సూచనలను  అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేయాలని అధినేత కేసీఆర్ కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget