Congress 420 Promises Booklet: కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్
BRS releases booklet on Congress Promises: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదంటూ, కాంగ్రెస్ 420 హామీల పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్ లెట్ విడుదల చేసింది.
BRS releases Congress 420 promises booklet: హైదరాబాద్: ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees) హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా బాలికలు, విద్యార్థినులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్‌లో సిటీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం (Free Travel for Women in Telangana) అమలు చేస్తోంది. అయితే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని సైతం రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదంటూ, కాంగ్రెస్ 420 హామీల పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్ లెట్ (Congress 420 Promises Booklet) విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీల ఇవి అని బుక్ లెట్ తీసుకొచ్చింది.
ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. హామీలు అమలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్ లెట్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్. ముందుగానే డిసైడ్ అయ్యారో లేదో తెలియదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచే 420 నంబర్ ఉండేలా కాంగ్రెస్ హామీలు ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినరోజు నుంచే సాకులతో హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని ఆరోపించారు. ఏవో కొర్రీలు పెట్టి కొన్ని పథకాలకు లబ్ధిదారులను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకు తాము కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ తీసుకొచ్చామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్
లోక్ సభ ఎన్నికలకు ముందే హామీలు అమలు చేపట్టాలి..
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను.. ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు, వ్యవసాయ రంగం, విద్యా రంగం, యువత, అమరులు, సాగునీటి రంగం, మైనారిటీ, బీసీలు, మహిళా సంక్షేమం, విద్యా వైద్య రంగాలు, ఉద్యోగుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి, పర్యాటక రంగం, పర్యావరణం, గృహ నిర్మాణం సహా ఇతర హామీలు మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.