By: ABP Desam | Updated at : 24 May 2023 04:32 PM (IST)
కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం మారిందా ?
BRS : కొత్త పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవంపై జాతీయ స్థాయిలో రాజకయం జరుగుతోంది. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటనలు చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఈ జాబితాలో ఉన్నాయి.
విపక్ష పార్టీలతో కలవని బీఆర్ఎస్
అయితే ఈ 19 పార్టీల జాబితాలో భారత రాష్ట్ర సమితి లేదు. దీంతో ఆ పార్టీ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వెళ్తుందా లేదా అన్న సంశయం ప్రారంభమయింది. అధికారికంగా బీఆర్ఎస్ ఇంకా ఈ అంశంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు కొంత మంది పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపచేయడం కరెక్ట్ అని వాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ అధికారిక స్టాండ్ ఏమిటో తెలియకపోవడం ..ఇంకా చెప్పకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం భవిష్యత్ రాజకీయాలకు.. విపక్షాల కూటమికి.. ఈ అంశం ఓ వేదికగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతూండటమే.
నన్ను ఎలా వాడుకోవాలనేది బీజేపీ హైకమాండ్ ఇష్టం - ఈటల కీలక వ్యాఖ్యలు !
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వెళ్తారా ?లేదా ?
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూటమి కడుతున్నాయి. ఇలా పందొమ్మిది పార్టీలు ఒకే వేదికపైకి వచ్చినట్లుగా ఉన్నాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో ఆ పార్టీలతో కలవకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. గతంలో రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనూహ్యంగా ఇప్పుడు వారికి దూరమయ్యారు. అయితే కేసీఆర్ వారికి ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నారా లేకపోతే.. వారే కేసీఆర్ ను కలుపుకునేందుకు ఆసక్తి చూపించడం లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
డింపుల్ వర్సెస్ ఐపీఎస్ రాహుల్ కేసులో బల్దియాకు చిక్కులు, అలా ఎలా వదిలేశారు సార్?
కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం మారిందా ?
కారణం ఏదైనా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ .. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై అసలు స్పందించకపోవడం .. పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది . ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గించేలా ఆర్డినెన్స్ తెచ్చిన అంశంలోనూ విపక్షాలు పోరాడుతున్నాయి. కానీ ఈ విషయంలోనూ కేజ్రీవాల్ కు.. కేసీఆర్ సంఘిభావం చెప్పలే్దు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయ పయనంపై ఊహాగానాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు
TSPSC News : తవ్వకొద్దీ అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?
Top 5 Headlines Today: సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి! రైలు ప్రమాద ఘటనపై జగన్, కేసీఆర్ దిగ్భ్రాంతి? టాప్ 5 హెడ్ లైన్స్
Minister Errabelli: వరంగల్‌లో ఘనంగా రైతు దినోత్సవ సంబురాలు - కేసీఆర్ రైతు పక్షపాతి అంటున్న మంత్రి ఎర్రబెల్లి
Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?