అన్వేషించండి

Harish Rao on Staff Nurse Posts ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ - స్టాఫ్ నర్సుల ఉద్యోగాలపై హరీష్ రావు సెటైర్లు

Harish Rao Fires on Congress Govt: స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని చూస్తే ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు.

Staff Nurse posts in Telangana: హైదరాబాద్: స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని చూస్తే ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ సెటైర్లు వేశారు. అది తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీపై హడావుడి చేయడం దౌర్భాగ్యమన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సుల(Staff Nurse)కు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్బాటంతో నిర్వహిస్తుందన్నారు. 

తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్ కు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగిందని తెలిపారు. 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ, నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తూ, స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.

ఏడాదిలోగా 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామి ప్రకారం, ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు. చెప్పినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, అలాగే ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3,4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.   
  
నర్సింగ్ ఆఫీసర్లకు శుభాకాంక్షలు..
స్టాఫ్ నర్సులుగా ఎంపికై బుధవారం నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మన్ననలు పొందేలా అత్యుత్తమ సేవలందించి, ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్సార్బీ)ని అభినందించారు. మా ప్రభుత్వం నర్సుల సేవలను గుర్తించి, వారి గౌరవాన్ని మరింత పెంచేలా వృత్తి పేరును ఉన్నతీకరించిందని హరీశ్ రావు అన్నారు. 
స్టాఫ్ నర్స్ ని నర్సింగ్ ఆఫీసర్ గా, హెడ్ నర్స్ ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా, హెడ్ నర్స్ ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1ను చీఫ్ నర్సింగ ఆఫీసర్ గా మార్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. నర్సు పోస్టుల పేరును మా ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసి ఉన్నతీకరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్టాఫ్ నర్సులుగా పరిగణించడం శోచణీయమన్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget