News
News
వీడియోలు ఆటలు
X

తెలంగాణ భవన్‌లో రోజంతా BRS నేతల హడావుడి, మోదీ టూర్‌కు దూరంగా సీఎం కేసీఆర్!

బండి సంజయ్ కేంద్రంగా BRS కౌంటర్ల మీద కౌంటర్లు

కోల్ బెల్ట్ ఏరియాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని

FOLLOW US: 
Share:

బీఆర్‌ఎస్‌ నేతలు వరుసబెట్టి బీజేపీకి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా నేతలంతా విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో రోజంతా గులాబీ నేతల హడావిడి కనిపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరితర్వాత ఒకరు వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ మీద ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ మోదీ టూర్‌కు దూరంగా ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. సింగరేణి సమ్మె మోత మోగుతుందని అన్నారు. కోల్ బెల్ట్ ఏరియాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని BRS నేతలు తేల్చిచెప్పారు.  

ప్రధాని సభకు కేసీఆర్ రావడం లేదు- వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చెర్మన్  

ప్రధాని మోదీ తెలంగాణను గందరగోళ పరచాలని చూస్తున్నారన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చెర్మన్ వినోద్ కుమార్. అభివృద్ధిలో తెలంగాణకు వీసమెత్తు సాయం చేయడం లేదన్నారు. జాతీయ రహదారుల విషయంలో నితిన్ గడ్కరీ దగ్గరికి పోతే నేనేం చెయ్యాలి అని అన్నారని తెలిపారు. ఇప్పుడు ఉన్నది మునుపటి బీజేపీ పార్టీ కాదు. ప్రధాని తెలంగాణకు జాతీయ రహదారులు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు ఇవ్వాలనే హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు? తెలంగాణ ప్రజలకు చట్టబద్దంగా రావాల్సినవి రావడం లేదని.. మోదీ మేం అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. రేపు ప్రధాని సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు.. ఆయన ఒక్కరే వచ్చి పోతారని క్లారిటీ ఇచ్చారు వినోద్ కుమార్ 

పాపాలు చేసైనా పవర్‌లోకి రావాలనేదే బీజేపీ సిద్ధాంతం- మంత్రి ఎర్రబెల్లి  

బండి సంజయ్ విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. సంజయ్ విద్యార్థులు జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని... రెండు పేపర్లు లీక్ కావడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్ని పాపాలైనా చేయాలి పవర్‌లోకి రావాలి అనేది బీజేపీ విధానమన్నారు. అసలు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని బండిని ప్రశ్నించారు. పొరపాటును ఇప్పటికైనా ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీ అంటే బ్రోకర్. జే అంటే జుమ్లా. పీ అంటే పేపర్ లీకేజ్ పాలిటిక్స్ అన్నారు. బండి మీద యాక్షన్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో సంబంధం ఉన్నట్లే అన్నారు మంత్రి ఎర్రబెల్లి  

నమో అంటే నమ్మక ద్రోహం, మోసం -ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బీజేపీ అబద్దాల బండి.. దాని నాయకుడు తొండి సంజయ్ అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బండి రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అన్నారు. కేసీఆర్‌ను డైరెక్టుగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. లీకేజీ వ్యవహారంలో కర్త కర్మ క్రియ సంజయే అన్నారు. పరీక్షపత్రాల లీకేజీలో పట్టపగలే దొరికిన వ్యక్తి బండి సంజయ్ అని.. నమో అంటే నమ్మక ద్రోహం, మోసం అన్నారు. మోడీ ప్రజలను , దేశాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని తెలిపారు. మోదీకి దమ్ముంటే రాష్ట్రానికి నిధులు తీసుకొని రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు

సింగరేణిని అదానీకి అప్పచెప్పే కుట్ర - ఎమ్మెల్యే బాల్క సుమన్ 

బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మరో ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలు సంజయ్ వైఖరిని గమనిస్తున్నారని.. కేంద్రపెద్దలు బండి సంజయ్ గో ఎ హెడ్ అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో సంజయ్ సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నాడని.. సింగరేణిని ప్రైవేటీకరించక పోతే సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి ఎందుకు కేటాయించడం లేదని అడిగారు. ప్రధానికి సీఎం లేఖ రాసినా  సింగరేణికి కేటాయించ లేదని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఎవరూ చెప్పిన మాట మీద నిలబడటం లేదన్నారు.. వేలాదిగా సింగరేణి కార్మికులు ధర్నా చేయబోతున్నారని స్పష్టం చేశారు. సింగరేణిని అదానీకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలను సింగరేణి ప్రాంతాల్లో తిరగనివ్వరని తెలిపారు. లీకేజ్ వ్యవహారాల వెనక కేంద్ర పెద్దల హస్తం ఉందని.. విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎవరిని వదలద్దని సుమన్ అన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అన్నారాయన. త్వరలో కేటీఆర్ మీద విచారణ జరుగుతుంది అని చెప్పాడు.. అయన ఏమైనా విచారణాధికారా? తెలంగాణ ప్రజలు అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.   

బండి సంజయ్ పోలీసులను కూడా బెదిరిస్తున్నాడు ఎమ్మెల్సీ పల్లా  

పేపర్ లీకేజీ విద్యార్థుల మనసులను బాధించిందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా పరీక్షలు జరిగాయన్నారు. బండి సంజయ్ అడ్డంగా మాట్లాడుతున్నాడని.. నిన్న ఫోన్ పోయింది అని చెప్పి, ఈ రోజు నా ఫోన్ తో మీకు ఏం పని అంటున్నాడని విమర్శించారు. పోలీసులను కూడా బండి సంజయ్ బెదిరిస్తున్నాడని అన్నారు. లీకేజీకి సూత్రదారులు బీజేపీ నేతలనీ.. పిల్లలను సంస్కారంగా పెంచడంలో కూడా బండి విఫలం అయ్యారని ఎమ్మెల్సీ పల్లా   విమర్శించారు.

 

 

Published at : 07 Apr 2023 06:32 PM (IST) Tags: BJP Bandi Sanjay BRS Telangana bhavan press meet

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

Vemula Prashanth Reddy: తెలంగాణ దశాబ్ది సంబరాల నిర్వహణపై మంత్రి రివ్యూ, ప్రణాళిక ఇదీ

Vemula Prashanth Reddy: తెలంగాణ దశాబ్ది సంబరాల నిర్వహణపై మంత్రి రివ్యూ, ప్రణాళిక ఇదీ

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!