Revanth Reddy: బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ‘బి’ టీం అని మరోసారి నిరూపితమైంది- రేవంత్ రెడ్డి ట్వీట్
Revanth Reddy About Free Power To Farmers: బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ‘బీ’ టీమ్ అని మరోసారి నిరూపితమైందన్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy About Free Power To Farmers: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ‘బీ’ టీమ్ అని మరోసారి నిరూపితమైందన్నారు రేవంత్ రెడ్డి. రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచిత విద్యుత్ పైకి దృష్టి మరల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందని, ఈ 9 ఏళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి, సహా పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అనేది పార్టీలకు బ్రహ్మాస్త్రం లాంటింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఈ ఉచిత విద్యుత్‌దే కీలక పాత్ర. అప్పటి నుంచి దీన్ని అందిపుచ్చుకున్న పార్టీలు వివిధ రాష్ట్రాల్లో దీన్నో ఓట్ల మంత్ర దండంలా వాడుకుంటున్నాయి. అందుకే దీన్ని చాలా నైస్‌గా డీల్ చేయాలంటారు. అలాంటి సెన్సిటివ్ ఇష్యూపై రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.
🔥బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది.
— Revanth Reddy (@revanth_anumula) July 11, 2023
రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది.
🔥బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది.
12…
రేవంత్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం, చేసిన ప్లేస్ వేరు అయినా సరే ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ చేసిన కామెంట్స్‌ను ప్రత్యర్థులు క్యాచ్ చేశారు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బీఆర్‌ఎస్ వాటిని క్షణాల్లోనే దాన్ని వైరల్ చేసింది. రేవంత్ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులతో వీడియోలు కూడా క్రియేట్ చేసింది. ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా వ్యతిరేకమంటూ పోస్టర్లు చేసి షేర్ చేసింది.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీష్ రెడ్డి వక్రీకరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 8 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్ ఇస్తే రైతులకు సరిపోతుందని రేవంత్ అన్నారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని రేవంత్ పేర్కొన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే తమ పార్టీ అని, వారి రుణాలు సైతం మాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలిచింది తామే అన్నారు. కానీ రైతులకు ఉచిత విద్యుత్ తీసేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, కేవలం 3 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అంశం తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన విషయమని తెలిసిందే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial