By: ABP Desam | Updated at : 22 Dec 2022 01:04 PM (IST)
ఉపాధి హామీ నిధులపై కేంద్రం దుష్ప్రచారంపై ఆగ్రహం - శుక్రవారం బీఆర్ఎస్ ధర్నాలు
BRS Dharnas : తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బిజెపి ఉందంటున్నారు. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యంతరం చెప్పని మోడీ సర్కారు తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ తరఫున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇటీవల ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన రైతుల కల్లాల సొమ్మును వెనక్కి ఇవ్వాలని కేంద్రం లేఖ రాసింది. దీంతో వ్యవసాయ కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని అడుగుతోందని కేటీఆర్ భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే… మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని విమర్శించారు. తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదే తరహా సిమెంట్ కల్లాలను ఉపాధి హామీ పథకంలో భాగంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసినా పట్టించుకోవడంలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు. కేవలం తెలంగాణ మీద వివక్షతోనే పనికిమాలిన షరతులను మోడీ సర్కారు తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. ఇందులో భాగంగా 750 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న 79000 వ్యవసాయ కల్లాల నిర్మాణాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఉపాధి హామీ పనులతో రైతులు ఉపయోగం జరిగితే తప్పా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని కేటీఆర్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకి నేరుగా డబ్బులు అందించే రైతు బంధు కార్యక్రమం తో మొదలుకొని రైతు బీమా, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధి హామీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్న తమ ప్రభుత్వ సదుద్దేశానికి మోడీ ప్రభుత్వం దురుద్దేశాలు ఆపాదిస్తుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ప్రగతి పైన ఉన్న గుడ్డి వ్యతిరేకతతో కేంద్రం కక్ష కట్టిందన్నారు. వ్యవసాయ రంగ అనుబంధ పనులకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్ర రైతులపై కక్ష సాధించేందుకు మాత్రమే నిధులు మళ్లింపు అంటూ మోడీ సర్కారు దుష్ప్రచారం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయంఅన్నట్టుగా కేంద్రం తీరు..ఉందన్నారు.
మన రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా!! అన్న కేటీఆర్, మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని మరో కుట్రకు తెర లేపిందన్ననారు. తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడం ఇదేనా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణం కి ఖర్చయిన 151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కేటీఆర్ కోరారు.
CM KCR Nanded Tour: నేడే నాందేడ్లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
BRS Vs MIM : అసెంబ్లీ వాగ్వాదం తెలంగాణ రాజకీయాల్ని మార్చిందా ? ఎంఐఎంతో వైరం బీఆర్ఎస్కు నష్టమేనా ?
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
Telangana Jobs: కొత్త వైద్య కళాశాలలకు 313 పోస్టుల మంజూరు, ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ!
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన