KCR: 'అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం' - పంట పొలాలు పరిశీలించిన గులాబీ బాస్
Telangana News: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
KCR Tour In Karimnagar: రైతులు ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన ముగ్ధుంపూర్ లో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ఆయనకు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గులాబీ బాస్ దృష్టికి తెచ్చారు. మంచినీళ్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు చెప్పారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో రైతులతో ముచ్చటించనున్న అనంతరం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
చొప్పదండి నియోజకవర్గం, రామడగు మండలం, వేదిర గ్రామంలో ఎండిన వరి కంకులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి అందజేసిన రైతులు
— BRS Party (@BRSparty) April 5, 2024
ఈ సందర్భంగా బస్ దిగి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు. pic.twitter.com/BCXZxObnCT
రైతన్న కోసం కేసీఆర్ పొలం బాట
— BRS Party (@BRSparty) April 5, 2024
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్ధతతో.. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసీఆర్ ముందు సమస్యలు… pic.twitter.com/WVuGzoJr74
రైతులందరూ ధైర్యంగా ఉండి.. ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం కట్టియ్యాలని కొట్లాడుదాం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుదాం.
— BRS Party (@BRSparty) April 5, 2024
కరీంనగర్ జిల్లా, ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/ZfFCVlPa76
జేబుదొంగ హల్ చల్
అటు, కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. పలు మండలాల్లో ఆయన ఎండిన పంటలను పరిశీలిస్తుండగా ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ.10 వేలు కొట్టేశాడు. అయితే, దొంగను పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు.
Also Read: Delhi liquor scam case : సీన్‌లోకి సీబీఐ - కవితను ప్రశ్నించేందుకు అనుమతి కావాలని కోర్టులో పిటిషన్