BJP MP Dharmapuri Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి దాడి కేసు - రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు!
BJP MP Dharmapuri Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
BJP MP Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించాయి. ఇదే విషయంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు తమ నేతలను ఇలా దూషిస్తారా అంటూ ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. కాగా ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితపై పదే పదే రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేశారని.. అందుకు నిరసనగానే దాడి జరిగినట్లు వివరించారు. ఏ కార్యక్రమంలో అయినా సరే, మీడియా సమావేశంలోనైనా సరే టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ, కవితపై తీవ్రమైన ఆరోపణలు చేసి, వాటిని వైరల్ చేశారని వివిరంచారు.
అంతేకాకుండా ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ ఇంటి దగ్గర పూర్తి స్థాయి బందోబస్తు లేకపోవడంతో దాడికి పాల్పడినట్లు వివరించారు. ఇంట్లో పూజ సామగ్రి, హాల్ ధ్వంసంతోపాటు కారుపై కూడా దాడి చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ ఘటనలో రెండు సిమెంట్ రాళ్లు, రెండు కర్రలు, టీఆర్ఎస్ పార్టీ జెండాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే నిందితులకు 41 సీఆర్పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు బెయల్ మంజూరు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అసలేం జరిగిందంటే..?
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో 8 మంది టిఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. భారీగా అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలతో అదుపు చేయడం క్షష్టంగా మారింది. అక్కడకి చేరుకొని బీజేపీకి, ఎంపీ అరవింద్ కు వ్యతిరేక నినాదాలు నినాదు చేస్తూ ఇంటి అద్దాలు పగులగొట్టారు. దీనిపై ధర్మపురి అరవింద్, ఆయన తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు పై టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది అరెస్ట్ చేశారు. ఐపీసీ 452,148,427,323,354, r/w 149 సెక్షన్ల కింద దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన వారిని నేటి రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు.
కాంగ్రెస్ లో చేరతారని ప్రచారంపై వివాదం..
కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిన కవిత... తాను పార్టీలో చేరుతానంటూ చెప్పారని అర్వింద్ నిన్న కామెంట్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను, కవిత కలిసిందని తాను చెప్పలేదని స్పష్టం చేశారు.