News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BJP Election Candidates : రెండు రాష్ట్రాల్లో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ - తెలంగాణలో ఎప్పుడు ?

మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. తెలంగాణలో తొలి జాబితాపై ఇంకా కసరత్తు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

BJP Election Candidates :  ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలపై బీజేపీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులపై కసరత్తు జరిపింది. రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది.  కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్​ ఇవ్వకముందే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను  రిలీజ్​ చేసింది. 

బీజేపీ బలంగా ఉన్న చోట్ల మందే అభ్యర్థుల్ని రిలీజ్ చేయాలని మోదీ సూచన !

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను ముందుగానే రిలీజ్ చేయాలని  ప్రధాని మోదీ ఆదేశించినట్టుగా  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.   రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించక ముందే బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థుల జాబితాలను ప్రకటించేవారు. ఈ సారి ముందుగానే కార్యాచరణలోకి వచచేశారు.  బీజేపీ తన తొలి జాబితాలో ఛత్తీస్‌గఢ్‌కు 21 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో ఐదుగురు మహిళలున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ఐదుగురు మహిళలు సహా 39 మంది అభ్యర్థులను కూడా బీజేపీ తన తొలి జబితాని ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లో అధికారంలో బీజేపీ - చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ చేతిలో ! 

వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం. పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్  రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమీక్షించిన   తర్వాత ఈఅభ్యర్థుల ప్రకటన వెలువడింది.  ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ముఖ్య నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేయడానికి పార్టీకి తగినంత సమయం ఉండేలా, అభ్యర్థుల మొదటి జాబితాను త్వరగా ప్రకటించాలని ప్రధాని మోడీ బీజేపీ అగ్ర నాయకులను సూచించడంతో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా తెలు్సతోంది.  230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి, 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చేనెలలో ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ తొలి జాబితా ఎప్పుడు ?

తెలంగాణ, రాజస్థాన్‌లలోనూ అభ్యర్థుల ఎంపికైప బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్షించినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో తొలి జాబితా విడుదలకు మరికొంత సమయం తీసుకోవాలని అనుకున్నారు. తెలంగాణలో తొలి జాబితా ఇప్పటికే సిద్ధమయింది.  అయితే.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఎదురు చూడాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.                                          

Published at : 17 Aug 2023 05:52 PM (IST) Tags: Telangana BJP List of BJP Candidates Telangana BJP Candidates BJP Central Election Committee

ఇవి కూడా చూడండి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

టాప్ స్టోరీస్

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?