Ramesh Babu: బీఅర్ఎస్ పార్టీకి బిగ్ షాక్! బీజేపీలో చేరిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు
రమేష్ బాబుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ముదోల్ ఎమ్మేల్యే విఠల్ రెడ్డి పనితీరుకు నిరసనగా ఇటివలే ఆ పార్టీకి రాజీనామా చేసిన భైంసా మార్కెట్ కమిటి ఛైర్మన్ రాజేష్ బాబు సహా 500 మంది బీఅర్ఎస్ పార్టీ నాయకులు గురువారం హైదరబాద్ లోని బిజేపి కార్యాలయంలో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆద్వర్యంలో బిజేపి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాధరంగా ఆహ్వానించారు. ముధోల్ ఎమ్మేల్యే విఠల్ రెడ్డి పనితీరు నచ్చక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో ముధోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి జడ్పీటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, రాజేష్ బాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున తరలివెళ్ళి బీజేపీలో చేరారు. ముధోల్ ఎమ్మేల్యే విఠల్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజుల నుంచి వీరంతా పోరాటం చేపట్టిన బిఆర్ఎస్ అసమ్మతి వర్గం ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం విధితమే.
అయితే పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నాయకులంతా ఇంకా బీజేపీలో చేరెందుకు సిద్దమున్నట్లు తెలుస్తోంది. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, కుంటాల మాజీ ఎంపీపీ అరుణ రమణారావు, జెడ్పిటిసిలు సోలంకే దీప, వసంత రమేష్, ముధోల్ సీనియర్ నాయకులు నర్సాగౌడ్ తో పాటు నియోజకవర్గంలోని దాదాపు 500 మందికి పైగా అనుచర గణం కిషన్ రెడ్డి ఆద్వర్యంలో పార్టీలో చేరారు.
నిన్నటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన ఈ నేతలంతా ఎమ్మెల్యే పనితీరుకు నిరసనగా ఆయన కు వ్యతిరేకంగా బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు అంతా సిద్ధమయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలేలా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ హయాంలోనూ వారికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పేదలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా న్యాయం జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు బీజేపీ నేతలు వెళ్తే .. ముఖ్యమంత్రికి అంత ఉలుకెందుకని కిషన్ రెడ్డి -ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలకు అన్ని పథకాలు అందినట్లయితే సిఎం ఎందుకు భయపడుతున్నట్లని నిలదీశారు. గజ్వేల్ ఏమైనా కెసిఆర్ ప్రైవేట్ ఆస్తా? అక్కడికి వెళ్తే అడ్డుకునే హక్కు ఆయనకు లేదన్నారు.
తెలంగాణ రైతులు అమాయకులు అనుకోవద్దని, రైతుల శక్తి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారన్నారు. కాంగ్రెస్ హయాంలో కమిషన్లు తీసుకుంటే.. బిఆర్‌ఎస్ హయాంలో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కెసిఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ పై రాష్ట్రంలో ఇక యుద్ధం మొదలైందని కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి పార్టీలో చేరికలను ఎవరు ఆపలేరని చెప్పారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక కార్యకర్త కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త బిజెపి గెలుపు కోసం పాటుపడాలని కిషన్ రెడ్డి చేశారు.