Bandi Sanjay: పోడు భూముల పట్టాలు ఏవీ.. ఆ 12 నియోజకవర్గాల్లో బీజేపీదే విజయం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలప్పుడే.. పోడు సమస్యలు గుర్తుకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి.. విస్మరించారని విమర్శించారు.

FOLLOW US: 

పోడు భూముల పట్టాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే.. కేసీఆర్ కు పోడు భూముల విషయం గుర్తుకువస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్నారు. దానికోసం ఇప్పటికే.. ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎస్టీ మోర్చా నేతలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయడంపై మండిపడ్డారు. 12 శాతం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని.. ప్రశ్నించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ హోటల్​లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.  

'రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాం.  రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై మాట్లాడుకున్నాం. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుంది.' అని బండి సంజయ్ అన్నారు.

ఎన్నికల సమయం వస్తే చాలు.. సీఎం కేసీఆర్​కు పోడు భూముల సమస్యలు గుర్తుకు వస్తాయని బండి సంజయ్ విమర్శించారు. నాగార్జునసాగర్ ఎన్నికలు, హుజూర్​నగర్ ఎన్నికలప్పుడు.. పట్టాలిస్తానని చెప్పారని గుర్తు చేశారు. 12 శాతం రిజర్వేషన్లపై హామీ ఏమైందని ప్రశ్నించారు. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు.  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీమంత్రి రవీంద్రనాయక్, చాడ సురేష్ రెడ్డి, హుస్సేన్ నాయక్, ఎస్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: Hyderabad: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ

Also Read: JC Diwakar : ప్రగతిభవన్‌ వద్ద జేసీ దివాకర్ హల్ చల్.. అపాయింట్‌మెంట్ లేకుండా లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు ! 

Also Read: TS High Court: తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఫైర్, మార్చి 14 వరకూ డెడ్ లైన్.. లేదంటే..

Also Read: PV Ramesh Parents : రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !

Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 03:39 PM (IST) Tags: BJP cm kcr Bandi Sanjay bandi sanjay on kcr Podu lands Telangana Podu Lands Issue

సంబంధిత కథనాలు

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?