అన్వేషించండి

Bandi Sanjay : హైదరాబాద్ సహా 17 ఎంపీ స్థానాలు బీజేపీ టార్గెట్ - వారంతా ఓటు బ్యాంక్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

BJP: పాతబస్తీలో హిందువులు అంతా ఓటు బ్యాంక్‌గా మారుతున్నారని బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీలో చేరే వారికే భవిష్యత్ ఉంటుందన్నారు.

Hindus are becoming a vote bank: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను సాధించడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు.  హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని చెప్పారు.   కరీంనగర్ లోని  48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం  58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

17 లోక్‌సభ సీట్లు గెలవడమే లక్ష్యం 

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం జాగీరని భావించారు. కానీ పాతబస్తీలోనూ హిందువులంతా ఓటుబ్యాంకుగా మారబోతున్నరు. హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నామన్నారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలో లక్షలాది భోగస్ ఓట్లున్నట్లు ఆధారాలు సేకరించాం. అట్లాగే పెద్ద ఎత్తున ఓట్లు కూడా గల్లంతయ్యాయి. ఓటర్లను సుదూర ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లకు కేటాయించడంతో ఓటింగ్ శాతం కూడా తగ్గింది. వీటికి సంబంధించి బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఆంటోనీరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బృందం  అన్ని ఆధారాలతోసహా  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనికితోడు కొత్త ఓటర్లను నమోదు చేయిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని సర్వేలు, జాతీయ మీడియా సంస్థలు సైతం బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లను గెలవబోతోందని నివేదికలు కూడా ఇచ్చాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు 

అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రైళ్లను ప్రకటించింది. బీజేపీకి సంబంధం లేదు. భక్తులు అయోధ్య వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే రైలు ప్రయాణంసహా అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పిస్తూ భక్తులను ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ నుండి రైళ్లను ప్రత్యేకంగా వేసింది.  గావ్ ఛలో అభియాన్ లో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కో గ్రామానికి వెళ్లి పల్లె నిద్ర చేయాలి. నగరాల్లో బస్తీ నిద్ర చేయాలి. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలి. చారిత్రాక కట్టడాలుంటే సందర్శించాలి. కొత్త ఓటర్లుంటే వారితో మమేమకం కావాలి. అందులో భాగంగా హుజూరాబాద్ లోని రంగాపూర్ గ్రామంలో రాత్రి బస చేయబోతున్న.

కాంగ్రెస్ లోకి లీడర్లు - బీజేపీకి అండగా ప్రజలు 

కాంగ్రెస్ లో చేరికలపై,ఏ రాజకీయ పార్టీ అయినా వారి మనుగడ చూసుకుంటుంది. కానీ ప్రజలు మాత్రం బీజేపీనే ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశానికి దశ దిశ చూపబోయే నాయకుడు నరేంద్రమోదీ మాత్రమేనని విశ్వసిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని సలహా ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Embed widget