అన్వేషించండి

Bandi Sanjay : పోకిరి సినిమా సీన్‌నే కాపీ కొట్టారు - ఫామ్ హౌస్ వీడియోలపై బండి సంజయ్ కౌంటర్ !

కేసీఆర్ వీడియోలకు పోకిరి సినిమా సీన్లతో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కేసీఆర్ ఓఎల్ఎక్స్ బ్యాచ్‌తో పక్కా స్క్రిప్ట్ ప్రకారమే సీన్ నడిపించారన్నారు.

 

Bandi Sanjay :   కేసీఆర్ బయట పెట్టిన ఫామ్ హౌస్ వీడియోల్లో ఏమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.   కేసీఆర్‌ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్‌ షో.. సెకండ్‌ షో అన్నాడు. చివరికి కామెడీ షో అ‍యింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్ వేశారు.  ఢిల్లీ లిక్కర్‌ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్‌ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చని స్పష్టం చేశారు.  ఫామ్‌హౌస్‌ స్క్రిప్ట్‌ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్‌, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారన్నారు. 

పోకిరి సినిమాలో సీన్ ప్రకారమే కేసీఆర్ ఫామ్ హౌస్ స్క్రిప్ట్ 

ఈ ఎపిసోడ్‌లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారని బండి సంజయ్ ప్రశఅనించారు.  ఇదంతా ప్లాన్‌ ప్రకారం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా?. తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. కేసీఆర్ వీడియోలు ప్రదర్శిస్తే.. మేమూ కొన్ని సినిమాలు చూపిస్తామంటూ.. కొన్ని క్లిప్పులు ప్లే చేశారు.  . పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్.. షాయాజీ షిండేకు మధ్య జరిగిన సన్నివేశాన్ని ప్రదర్శించిన బండి.. అందులో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగులను ఈ కేసుకు అన్వయిస్తూ కౌంటర్ వేశారు. కొందరు నేతలు టీఆర్ఎస్‌లోకి రాకముందు చేసిన విమర్శలకు సంబంధించి వీడియోలను ప్రదర్శించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడైనా అరెస్టులు 

లిక్కర్‌ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగవచ్చని, లిక్కర్‌ స్కామ్‌  కేసును డైవర్ట్‌ చేసేందుకే కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నారని సంజయ్‌ మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేయలేదన్నారు.  లిక్కర్‌ కేసు నుంచి ఎమ్మెల్సీ కవితను కాపాడుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.  లిక్కర్ కేసుపై ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ భయపడుతున్నారని దేశమంతా చర్చించుకుంటున్నారని తెలిపారు. బయటికి వెళ్దామనుకునే ఎమ్మెల్యేను బయపెట్టేందుకే.. ఈ సినిమా అని ఆరోపించారు. కుమారుడు, కుమార్తెను కాపాడుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు కూడా రక్షణ కల్పించాలని హైకోర్టును బండి సంజయ్ కోరారు. ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు వేయాలని సూచించారు.

వీళ్లంతా ఓఎల్‌ఎక్స్ బ్యాచ్ ! 

కేసీఆర్‌ 37 మంది నేతలను సంతలో పశువుల్లా కొన్నారని సంజయ్‌ గుర్తుచేశారు. ఫామ్‌హౌస్‌  వీడియోలు ఉన్న వీళ్లంతా ఓల్ఎక్స్ బ్యాచ్ అని విమర్శించారు.

తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు - ఇక జోరు పెంచబోతున్నారా ? 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget