By: ABP Desam | Updated at : 15 May 2022 09:33 PM (IST)
బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
బీజేపీ నాయకుడు సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని భగవంతుడు కూడా కాపాడలేడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సాయి గణేష్ కుటుంబం పరామర్శించడానికి ఖమ్మంకు వచ్చిన బండి సంజయ్ ముందుగా ఖమ్మం నగరంలోని సాయి గణేష్ ఇంటి వద్దకు చేరుకుని, సాయి గణేష్ కు నివాళి అర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సాయి గణేష్ కుటుంబానికి ఇల్లు లేని కారణంగా రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో స్థానికంగా ఒక ఇంటిని కొని ఆ కుటుంబానికి తన చేతుల మీదుగా ఇంటి పట్టాను అందించారు. అనంతరం నగరంలోని ఈఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుంది. అధికారులు సాయి గణేశ్ మరణ వాంగ్మూలం తీసుకోకపోవడానికి కారణం ఏంటి? సీఎంఓ, మంత్రి కనుసన్నలలో అధికార యంత్రాంగం వ్యవహరించింది. సాయి గణేశ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నప్పటి పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజీ బయటికి తీయాలి. సాయి గణేశ్ కు టీఆర్ఎస్ పార్టీ లాగా నేర చరిత్ర ఉందా? కోర్టు పీపీ సాయి గణేశ్ ను నేరస్థుడని ఎలా చెబుతారు. హై కోర్టులో రిట్ వేశాం. సీబీఐ విచారణ జరపాలని కోరాం. పోలీసులు మీడియాకు ఇచ్చిన మరణ వాగ్ములాన్ని ఎందుకు తీసుకోలేదు? పువ్వాడ గరికపాటి కంటే పెద్ద కమ్మోడు కాదు.. మంత్రి పువ్వాడ కమ్మ కుల సంఘం ఎన్నికల్లో ఓటమి పాలయ్యావు.. పువ్వాడ నకిలి కమ్మ.. సాయి గణేశ్ అసలైన కమ్మ. పువ్వాడను వదిలి పెట్టం.. పువ్వాడకు నేర చరిత్ర ఉంది.’’
‘‘అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి పువ్వాడ చేరుతారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. సాయి గణేశ్ ది ఆత్మహత్య కాదు మంత్రి చేసిన హత్య. టీఆర్ఎస్ & ఎంఐఎం కలిసి తప్పులు చేస్తున్నాయి. సీఎంఓ కార్యాలయానికి నేరాలు చేసిన వారి వాటాలు పోతున్నాయి. అధికారులు టీఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగేవాళ్లు ఉన్నారు. ముఖ్యమంత్రి 8 సంవత్సరాల షెడ్యూల్ లో అధిక శాతం ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యాడు. ఎంఎల్ఏలు, మంత్రులు కేసీఆర్ కంట్రోల్ లో లేరు. ఖమ్మంలో అరాచకాలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రి అజయ్ ని వదిలిపెట్టం.. పువ్వాడ అజయ్ బీజేపీలో చేరతానని కోరినా చేర్చుకోము.. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం.. భగవంతుడు కూడా అజయ్ ని కాపాడలేడ’’ని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ పైనా విమర్శలు
కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణను ఒక మూర్కుడు పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. దీనికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, సర్పంచ్ లు సహా తెరాస నేతలే దీనికి బాధ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీపరుడైతే, నిబద్ధత గలవాడైతే నేరస్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడు.’’ అని బండి సంజయ్ అన్నారు.
Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!
టీడీపీని వీడిన మరో సీనియర్ నేత - పార్టీలో అనుబంధం గుర్తు చేసుకుని కంటతడి !
Telangana Power : తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?
రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?