AP Trains Cancellation: ఇంటర్ లాక్ పనుల కారణంగా ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు!
AP Trains Cancellation: ఖాజీపేట-కొండపల్లి, చింతల్ పల్లి-నెక్కొండ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగానూ, మరికొన్నిరైళ్లను పాక్షింకగానూ రద్దు చేశారు.
AP Trains Cancellation: ఖాజీపేట - కొండపల్లి, చింతల్ పల్లి - నెక్కొండ స్టేషన్ మధ్యలో జరుగుతున్న మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన ట్రైన్స్ ఇవే
ఖాజీపేట-డోర్నకల్ (07753/07754), విజయవాడ - డోర్నకల్ (077555/07756), విజయవాడ - గుంటూరు (07464/07465), భద్రాచలం రోడ్డు - సికింద్రాబాద్ (17660/17659), విజయవాడ్ - సికింద్రాబాద్ (12713/127714) ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా ఖాజీపేట - తిరుపతి (17091/17092) రైళ్లు ఈనెల 23, 30 జూన్ 6వ తేదీల్లో, మచిలీపట్నం - సికింద్రాబాద్ (07185/07186) రైళలను ఈనెల 21, 28, జూన్ 4వ తేదీల్లో రద్దు చేశారు.
Cancellation of train services due to third line works pic.twitter.com/gNCcl4PZyQ
— South Central Railway (@SCRailwayIndia) May 19, 2023
Cancellation of Trains on 21st May, 2023 as detailed below: @drmsecunderabad @drmhyb @drmgtl @drmgnt pic.twitter.com/kiGi7oLT0E
— South Central Railway (@SCRailwayIndia) May 19, 2023
సిర్పూర్ టౌన్ - భద్రాచలం (17034) ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వరంగల్ - భద్రాచలం మధ్య,భద్రాచలం - సిర్పూర్ (17033) ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు భద్రాచలం - వరంగల్ మధ్య పాక్షక్షికంగా రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం - ముంబై ఎల్టీటీ (18519) ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7 వరకు వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. షాలిమార్ - సికింద్రాబాద్ (22849) ఈనెల 24, 28, జూన్ 4వ తేదీల్లో వయా సికింద్రాబాద్, పగిడపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. యశ్వంత్ పూర్ -టాటా నగర్ (18112) ఈనెల 21, 28, జూన్ 4వ తేదీల్లో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. హైదరాబాద్ - షా,లిమార్ (18046) ఈనెల 28, జూన్ 7వ తేదీల్లో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.
Partial Cancellation of train services due to third line works pic.twitter.com/TmFkkgxABT
— South Central Railway (@SCRailwayIndia) May 19, 2023