అన్వేషించండి

AP TS Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు, డిసెంబర్ 31న ఎంత తాగేశారంటే?

AP TS Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు గత ఏడాది తెగతాగేశారు. డిసెంబర్ నెలలో అయితే రికార్డులు సృష్టించారు. ఇంక డిసెంబర్ 31న అయితే కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గిఫ్ట్ ఇచ్చారు.

AP TS Liquor Sales : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మందుబాబు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. తమ జేబులు గుల్లచేసుకుని ప్రభుత్వాల ఖజానా నింపే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. ఆరు రోజుల్లో రూ.1111.29 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. డిసెంబరు 30న అత్యధికంగా రూ.254 కోట్లు, 31న రూ.216 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు ఓపెన్ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. దీంతో ఒక్క హైదరాబాద్‌లోనే మద్యం ప్రియులు  24 గంటల్లో 37.68 కోట్ల రూపాయల మద్యం తాగినట్లు తెలుస్తోంది.  ఏపీలో డిసెంబర్ 31న మందు అమ్మకాలు జోరుగా సాగాయి.  డిసెంబర్‌ 31న ఏపీలో మొత్తం రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. ఏపీలో కూడా మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.  

తెలంగాణలో మద్యం రికార్డులు 

తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.  2022లో మద్యంపై రూ.34 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ శాఖ తెలిపింది.  జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.34 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్ లో నల్లగొండ జిల్లా ఉంది.  మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన  2014–15లో రూ. 10.88 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.  2018–19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. 2020–21లో లిక్కర్ ఆమ్దానీ రూ.27.28 వేల కోట్లకు చేరుకుంది. ఈ సారి రూ.34 వేల కోట్లు వచ్చింది.

సగటున రూ.2500 కోట్ల ఆదాయం 

 2021–22లో సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆదాయం వస్తే.. 2022 సగటున రూ.3 వేల కోట్లు సమకూరుతుంది. 2021 ఏప్రిల్‌‌‌‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు రూ.21,763 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 2.65 కోట్ల ఇండియన్‌‌‌‌ మేడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ (ఐఎంఎల్‌‌‌‌) కేసులు, 2.36 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు రూ.25,147 కోట్ల మద్యం సరఫరా కాగా, ఇందులో 2.52 కోట్ల ఐఎంఎల్‌‌‌‌ కేసులు, 3.48 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. 2021 పోలిస్తే ఈ సారి కోటి 12 లక్షల బీర్ కేసులు ఎక్కువగా అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SpaceX catches Starship booster with Chopsticks | Mechzilla తో రాకెట్ ను క్యాచ్ పట్టిన SpaceX | ABPNASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
Tata Punch EV Offers: టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Embed widget