Top Headlines Today: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్! తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులు
Top Telugu Headlines Today 09 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

AP Telangana Latest News: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన 11మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రులకు శాఖ కేటాయింపు అంశంలో అధిష్టానంతో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో వరుసగా సమావేశమయ్యారు. చివరకి 11మంది మంత్రులకు శాఖలు ఫైనల్ చేసి... ఇవాళ ప్రకటించారు రేవంత్‌రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు విద్యుత్ శాఖను కూడా కేటాయించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Legislative Assembly) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్, ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తర్వాత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
2024 ఎన్నికలు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే తర్వాత పార్టీ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పటి వరకు చంద్రబాబు పూర్తి యాక్టివ్ గా ఉన్నారు. అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటున్నారు. వచ్చేదఫా ఆయన ఇంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు. వయోభారంతో ఆయన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే అవకాశం లేదు. అందుకే 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనేది చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహానికి తగ్గట్టు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారాయన. పార్టీ టికెట్ల వ్యవహారంపై కూడా మందుగానే హింట్ ఇచ్చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. సభ్యులంతా ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ ఉండటంతో.. ఆయన ఆధ్వర్యంలో తాము ప్రమాణ స్వీకారం చేయబోమని బీజేపీ నేతలు సభకు గైర్హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ కూడా తొలిరోజు సభకు గైర్హాజరయ్యారు. అనారోగ్య పరిస్థితుల వల్ల కేసీఆర్ ఈరోజు సభకు రాలేదు. అయితే ఆయన్ను బీఆర్ఎస్ నేతలంతా శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
యువగళం మళ్లీ మొదలు- గుండ్లకమ్మ ఘటనపై లోకేష్ ఘాటు ట్వీట్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం, శీలంవారిపాకలు జంక్షన్ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ మొదలైంది. ఇటీవల తుపాను కారణంగా ఆయన యువగళానికి విరామం ఇచ్చారు. ఈరోజు యువగళం 217వ రోజుకు చేరుకుంది. ఈ రోజుతో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యాత్ర పూర్తవుతుంది. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటకు చెందిన హేచరీస్ రైతులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ సెజ్ ప్రాంతంలో 500 రొయ్యల హేచరీలు ఉన్నాయని, దేశానికి అవసరమైన రొయ్యల సీడ్ లో 50శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నామని వారు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















