Breaking News Live Telugu Updates: అమర్‌నాథ్‌లో కుంభవృష్టి- యాత్రికులు చిక్కుకున్నట్టు సమాచారం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ 20 డిగ్రీస్ నార్త్ లో సముద్రం మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉత్తర ద్వీపకల్ప భారత్ మొత్తం కేంద్రీకృతమైంది. నిన్న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఇవాళ ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
ముఖ్యంగా ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మిగతా రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Telangana Weather: తెలంగాణలో ఇలా..
తెలంగాణలో అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు. ముఖ్యంగా నేడు తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్క భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాల్లో నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రేపు ఇక్కడ రెడ్ అలర్ట్
కానీ, 9న మాత్రం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అమర్‌నాథ్‌లో కుంభవృష్టి- యాత్రికులు చిక్కుకున్నట్టు సమాచారం
అమర్‌నాథ్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వాన ధాటికి చాలా మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. గుహ పరిసరాల్లో యాత్రకు వెళ్లిన వేల మంది ఉన్నారు. జూన్ 30 అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది.
MP Raghu Rama : ఎంపీ రఘురామకు హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
MP Raghu Rama : ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై, తన కుమారుడిపై గచ్చిబౌలి పీఎస్ లో దాఖలైన కేసు కొట్టివేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు. పిటిషన్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను ఇంట్లో నిర్భందించి దాడిచేశారని ఏపీ పోలీసులు ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టు తెలిపారు పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సైతం సస్పెండ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకభవించిన హైకోర్టు, రఘురామ పిటిషన్ కొట్టివేసింది.
ఆసుపత్రి నుంచి చియాన్ విక్రమ్ డిశ్చార్జ్- చికిత్స అనంతరం ఇంటికి పంపిన వైద్యులు
చియాన్ అభిమానులకు హ్యాపీ న్యూస్. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన చియాన్ విక్రమ్ డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. పొన్నియన్ సెల్వం సినిమా ట్రైలర్ లాంచ్‌కు వెళ్లి విక్రమ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు విక్రమ్ కు తగిన చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు.
Vikram Heart Attack: ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్‌కు గుండెపోటు
ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు విక్రమ్ కు తగిన చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Jaggareddy: సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేస్తా - జగ్గారెడ్డి
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కొద్ది రోజుల క్రితమే సంచలన ప్రకటన చేస్తానంటూ ఊరించిన సంగతి తెలిసిందే. తీరా సమయానికి చెప్పకుండా దాటవేశారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వీడటం కలలో కూడా జరగదని తేల్చిచెప్పారు. దసరా రోజున సంగారెడ్డి సభలో ఆ సంచలన ప్రకటన చేస్తానని చెప్పారు. తాను టీఆర్ఎస్ లో చేరతానంటూ వస్తున్న వార్తలు ఎప్పటికీ నిజం కాబోవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.