Breaking News Live Telugu Updates: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య ఆత్మహత్య
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొన్న (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.
ఎల్లో అలర్ట్ ఈ 13 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 6) రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కొమొరిన్ ప్రాంతం, పరిసరాల్లో సగటు సముద్ర మట్టం కంటే 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడిందని వివరించింది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.
ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.
తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి
ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి...
1) ఎంసెట్ - మే 7 నుంచి 14 వరకు
2) ఎంసెట్ ఇంజినీరింగ్ - మే 7 నుంచి 11 వరకు
3) ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా - మే 12 నుంచి 14 వరకు
4) ఎడ్ సెట్ పరీక్ష - మే 18
5) ఈ సెట్ పరీక్ష - మే 20
6) పీజీ లా సెట్, పీజీఎల్‌సెట్ - మే 25
7) టీఎస్ ఐసెట్ పరీక్ష - మే 26, 27
8) టీఎస్‌పీజీ ఈ సెట్ పరీక్ష - మే 29 నుంచి జూన్ ఒకటి
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య ఆత్మహత్య
బ్రేకింగ్...
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య...
ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
బీజేపీ కార్యకర్తపై మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం
సంగారెడ్డి జిల్లా... బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం
ఫోన్ చేసిన ఆందోల్ నియోజకవర్గ బిజెపి కార్యకర్త వెంకట రమణని బండ బూతులు తిట్టిన బాబు మోహన్
మీతో కలిసి పార్టీలో పని చేస్తానని చెప్పిన కార్యకర్త
నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆందోల్ ని అభివృద్ధి చేశానని చెప్పిన బాబు మోహన్
నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తను తిట్టిన మాజీ మంత్రి
నేను రెండు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారన్న బాబుమోహన్
నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై బాబు మోహన్ తిట్ల పురాణం
బండి సంజయ్ ఎవడ్రా..వాడు నా తమ్ముడు అన్న బాబు మోహన్
ఇంకో సారి నాకు ఫోన్ చేస్తే జ చెప్పు తీసుకుని కొడుతా అంటూ కార్యకర్తకు బెదిరింపు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో
Jallikattu: జల్లికట్టులో అపశృతి, ఎద్దు ఢీకొని ఒకరు మృతి, మరో నలుగురికి గాయలు
చిత్తూరు జిల్లా, వికోట మండలం, ఎర్రినాగేపల్లిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడు సాంప్రదాయాన్ని పాటిస్తూ సంక్రాంతి పండుగ తరువాత జల్లి కట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ జల్లికట్టును వీక్షించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే ఎద్దులను కట్టిన బహిమతులను చేజిక్కించుకునేందుకు యువత ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలో ఎద్దులు పరుగులు పెడుతున్న సమయంలో జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన మోర్నాపల్లికి చేందిన శీనప్ప (54) ను ఢీ కొనడంతో శీనప్ప తీవ్రంగా పడ్డాడు. మరో నాలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన వికోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శీనప్ప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు.
SVBC Chairman: ఎస్వీబీసీ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన నాగ దుర్గారావు
టిటిడి ఎస్వీబీసీ సలహాదారుడిగా నాగ దుర్గా రావు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నాగదుర్గా రావు దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయానికి ఆయన, ప్రభుత్వ ఆదేశానుసారం టీటీడీ ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయంలో సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు.