By : ABP Desam | Updated: 06 Mar 2023 07:43 PM (IST)
విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ డి బ్లాక్ పాంచజన్య పోలీ ప్రొడక్ట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. థర్మోకాల్ షీట్స్ తయారి కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేస్తున్నారు. గాజువాక చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైనా నల్లటిపొగతో అలముకుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 50 లక్షలు ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం అంటోంది. క్రోమియం వైర్ కట్ అవ్వడం ప్రమాదానికి కారణమని కంపెనీ సిబ్బంది తెలిపారు.
నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ ప్రియురాలు నిహారికను పోలీసుల అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు హరిహరకృష్ణ నిహారిక, హాసన్ పేర్లు చెప్పినట్లు తెస్తుంది. దీంతో నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆడిటర్ బుచ్చిబాబుకు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తులో బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే పాస్ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది.
ఫాక్స్‌కాన్ పరిశ్రమను తెలంగాణ లేదా కర్ణాటకలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొన్న వేళ దానికి తెరపడింది. ఫాక్స్‌కాన్ పరిశ్రమను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ తాజాగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా తాము కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరారు. అంతేకాక, తేవాన్‌లో పర్యటించాలని యాంగ్ లియూ కేసీఆర్‌ను ఆహ్వానించారు.
షూటింగ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు గాయాలు అయ్యాయి. హైదరాబాద్ జరుగుతున్న ప్రాజెక్ట్ కే షూటింగ్‌లోనే ఈ ఘటన జరిగింది. దీంతో ఆయన ముంబయికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ముంబయిలోని ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఓ కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన పుల్లూరి మహోదర్‌రావు (55), లక్కోడి మధుసూదన్ రెడ్డి (58), ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారావు కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో రామారెడ్డి బైపాస్‌కు కొద్ది దూరంలో వీరి కారును వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న రామకృష్ణారావు సురక్షితంగా బయటపడగా.. మిగతావారు చనిపోయారు. కంటైనర్‌తో డ్రైవర్ అక్కడ నుంచి పరారు కాగా.. తూప్రాన్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి భూరి విరాళం అందింది. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఆమె తన భర్త వడ్లమూడి రమేష్ బాబు జ్ఞాపకార్థం టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి గానూ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. విరాళానికి సంబంధించిన డీడీని దాతల కార్యాలయంలో ఆదివారం ఆమె అందజేశారు.
హోలీకి ముందు ఒక్కసారి ఉత్తర భారత వాతావరణంలో పెను మార్పు కనిపిస్తుంది. వేసవి కాలం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మళ్లీ పలు రాష్ట్రాల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో పాటు కొండ ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. మార్చి 5 నుండి మార్చి 8 వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
వెస్టర్న్ డిస్ట్రబెన్స్ మార్చి 7 నుండి వాయువ్య, పశ్చిమ, మధ్య భారత ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో పశ్చిమ రాజస్థాన్‌లో ఆదివారం (మార్చి 5) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి 8 వరకు తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, సెంట్రల్ మహారాష్ట్రల్లో ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ హరియాణా, పశ్చిమ రాజస్థాన్‌లో తేలికపాటి లేదా ఓ మోస్తరు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 8 వరకు తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, సెంట్రల్ మహారాష్ట్రల్లో ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతకు సంబంధించి, IMD ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు ఉండదని, అయితే ఆ తర్వాత ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ తగ్గవచ్చు.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణలో క్రమంగా చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి నేడు అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉండనుంది. నిన్న మొన్నటి వరకూ కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లేదా ఆరెంజ్ అలర్ట్ ఉండేది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.1 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా