Breaking News Live Telugu Updates: ఈ నెల 6న వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాల ప్రభావంతో సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల పై అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో సోమవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు ఆవర్తనాల ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తెలంగాణలకు మోస్తరు వర్ష సూచన ఉంది. దసరా తరువాత నుంచి రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. సోమవారం సైతం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తరాధి జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
రెండు రోజుల తరువాత కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడ్కడా భారీ వర్షాలు కురిసే అవకా: ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందటంతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడకపోతే మధ్యాహ్నానికి ఉక్కపోత అధికమై నగరవాసులు ఇబ్బంది పడతారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈ ప్రాంతాల్లో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు (అరకు వ్యాలీ, పాడేరు), పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మాత్రం సాయంత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో దసరా వరకు సాధారణ వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 6 తరువాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో ఒకట్రెండు చోట్ల నేడు వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 4 నుంచి తెలుగు రాష్ట్రాల పై అల్పపీడనం ప్రభావం ఉంటుంది. రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
ఈ నెల 6న వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6న ఢిల్లీ వెళ్లనున్నారు. 7వ తేదీన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. పాదయాత్రను మధ్యలో ఆపి మరి ఢిల్లీకి వెళ్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళ సైకి సైతం ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.
CM KCR: కేసీఆర్‌కు మద్దతు పలుకుతూ క్రైస్తవులు తీర్మానం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి మద్దతుగా క్రైస్తవ మత పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన చర్చ్ అయిన మెదక్ చర్చ్ బిషప్ ఏసీ సాల్మన్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ రాజీవ్ సాగర్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని క్రైస్తవులు తమ మాట పెద్దల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. దేవుడి ఆశీస్సులు సీఎం కేసీఆర్ కి ఉండాలని వారు ప్రార్థనలు చేశారు. కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరమన్నారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ సాగర్. సెక్యులర్ దేశంగా భారత దేశం ఉండాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. మతతత్వ పార్టీలతో దేశానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. దేశ రక్షణ కోసం మనమంతా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు క్రైస్తవులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కు దేవుడి ఆశీస్సులు ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ మంచు చరియలు- ప్రమాదంలో చిక్కుకున్న 28 పర్వతారోహకులు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని ద్రౌపది దండ-2 పర్వత శిఖరంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. హిమపాతంలో 28 మంది చిక్కుకున్నారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రస్తుతం త్వరితగతిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ శిఖరం ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాలలోని గంగోత్రి శ్రేణిలో ఉంది.
ఈ ఘటనపై సీఎం ధామీ ట్వీట్ చేస్తూ, ద్రౌపది దండలో హిమపాతంలో చిక్కుకున్న ట్రైనీలను రక్షించడానికి జిల్లా యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ, ఐటిబిపి సిబ్బందితోపాటు ఎన్‌ఐఎం బృందం వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి.
Bathukamma Celebrations: జగిత్యాలలో బతుకమ్మ ఆపివేయడంపై నిరసన వ్యక్తం చేసిన మహిళలు
- జగిత్యాలలో బతుకమ్మను ఆపివేసిన పోలీసులు
డీజే సౌండ్ కి పర్మిషన్ లేదన్న పోలీసులు - రోడ్డు పైనే బతుకమ్మ పెట్టి నిరసన వ్యక్తం చేసిన మహిళలు
- పట్టణంలోని లడ్డు ఖాజా చౌరస్తా వద్ద సద్దుల బతుకమ్మ సందర్భంగా భారీ బతుకమ్మ ఏర్పాట్లు
- మహిళలు కోలాటాలతో డీజే చప్పుళ్లతో వెళ్తున్న క్రమంలో అడ్డగించిన పోలీసులు
- డీజేలను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
- రోడ్డుపై బతుకమ్మలు పెట్టి నిరసన వ్యక్తం చేసిన మహిళలు
Warangal: వరంగల్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.