News
News
X

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ నోటీసులపై హైకోర్టు స్టే పొడిగించింది. ఈ నెల 13 వరకు హైకోర్టు స్టే పొడిగించింది.  జగ్గుస్వామి నోటీసులపై కూడా హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. 

వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నం! 

వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రికత్తకు దారితీసింది. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అయితే కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు అక్కడికక్కడే మృతి

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు అక్కడికక్కడే మృతి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న సోఫి నగర్ కు చెందిన షకీల్ (30), ఇద్రిస్ (55) అనే ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి టిప్పర్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని నిర్మల్ డిఎస్పి జీవన్ రెడ్డి పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తిరుపతి : రాష్ట్రపతి ముర్ముకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం

తిరుపతి : రాష్ట్రపతి ముర్ముకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం

రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొనుటకు రాత్రి 9.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం లభించింది.. ఏపి ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్ లు భారత రాష్ట్రపతికి స్వాగతం పలికారు.. యూనియన్ మినిస్టర్ జి.కిషన్ రెడ్డి భారత రాష్ట్రపతితో పాటుగా వచ్చి తిరుపతి జిల్లా పర్యటనలో పాల్గొననున్నారు.. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి‌ రోడ్డు మార్గం గుండా ద్రౌపతి ముర్ము తిరుమలకు బయలుదేరారు..

బిజెపి ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నేడు ఢిల్లీకి పయనం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేడు ఢిల్లీకి పయనం

రెండు రోజుల పాటు ఢిల్లీ లో ఉంటారు

పదాదికారుల సమావేశంలో సోము వీర్రాజు పాల్గొంటారు

ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం

రాష్ట్ర అభివృద్ధి కి సంబంధించిన అంశాలు కేంద్ర మంత్రులు కు వివరించే విధంగా ఢిల్లీ టూర్ ను వినియోగించనున్న సోమువీర్రాజు

విశాఖ... మధురవాడలో మహిళ హత్య, వాటర్ డ్రమ్ములో మృతదేహం

విశాఖ...
మధురవాడ వికలాంగుల కాలనీ లో మహిళ సంచలనం రేపిన హత్య ఘటన.
వాటర్ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం రేపుతోంది.
వాటర్ డ్రమ్ము లో మృతదేహం చూసి భయాందోళన చెందిన ఇంటి ఓనర్..
మృతదేహం పూర్తి గా కుళ్ళిపోవడం తో దుర్వాసన వస్తోంది
ఘటన స్థలానికి చేరుకున్న పిఎంపాలెం పోలీసులు.
24 గంటలు గడవకముందే నగరంలో రెండు హత్య సంఘటనలు.
వరస ఘటనలతో ఉలిక్కిపడ్డ విశాఖ.

Breaking News: త్వరలో బండి సంజయ్ బస్సు యాత్ర

త్వరలో బండి సంజయ్ బస్ యాత్ర

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకుల ప్లాన్

రాష్ట్రంలోని మిగలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర

5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర

10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ ఛార్జ్ మనోహర్ రెడ్డి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్, 26 మందికి నోటీసులు

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. 2014- 19 మధ్య కాలంలో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ.234 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, OSD కృష్ణ ప్రసాద్ లకు ఈడీ తాజాగా నోటీసులు  జారీ చేసింది.

విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.   రాష్ట్రపతికి పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ పోరంకి మురళి రిసార్ట్స్ కు బయలుదేరి వెళ్లారు రాష్ట్రపతి.  

నార్కేట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, లారీ-కారు ఢీకొని ఇద్దరు మృతి! 

Road Accident : పల్నాడు జిల్లా అద్దంకి నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచెర్ల సమీపంలో లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కిడకక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కనిగిరి పట్టణానికి చెందిన మల్లికార్జునరావు, ప్రసాద్‎గా పోలీసులు గుర్తించారు.

 

విశాఖలో అర్ధరాత్రి దొంగలు హల్ చల్  

Vizag News : విశాఖలో శనివారం అర్ధరాత్రి దొంగలు స్వైరవిహారం చేశారు. పోలీసులందరూ రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో ఉండగా అదునుచూసి చెలరేగిపోయారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి టైలర్స్ కొలనీలో విజయదుర్గాదేవి ఆలయంలో చోరీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర  సమయంలో దుండగులు ఆలయం తాళాలను కట్ చేసి అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు పుస్తుల తాడు,సూత్రాలతో పాటుగా హుండీని దొంగిలించారు. దొంగలు బైకు మీద హుండీతో పరారవ్వడాన్ని ఓ స్థానికుడు గమనించి ఆలయ ధర్మకర్తలకు సమాచారం అందించగా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవాలయాలలో చోరీలు నిత్యకృత్యంగా
మారడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Background

Weather Latest Update:  ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ పసిఫిక్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన సుమత్రా దీవులకు దగ్గర ఉంది. ఈ ఆవర్తనం బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఆవర్తనం డిసెంబర్ 5వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ తుపాను వల్ల ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. 

మాండస్ తుపాను 

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, 5న అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత బలం పుంజుకుని వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారుతుందని చెప్పారు. 8న తమిళనాడు, ఉత్తర శ్రీలంకల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుపానుకు మాండస్ గా నామకరణం చేశారు. దీంతో ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లోని బలమైన తుపాను డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు కూడా నిర్థారించారు. అయితే ప్రస్తుతానికి ఏపీకి తుపాను ముప్పు అంతగా లేదంటున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ, విశాఖల్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. 

Gold-Silver Price 04 December 2022: నిన్నటితో (శనివారం) పోలిస్తే బంగారం ధర (Today's Gold Rate) ఇవాళ (ఆదివారం) కూడా పెరిగింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 200, స్వచ్ఛమైన పసిడి ₹ 220 చొప్పున పైకి చేరాయి. కిలో వెండి ధర ₹ 900 పెరిగింది. 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,450 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 53,950 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 71,600 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,450 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 53,950 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 71,600 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 50,160 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,720 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,950 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,100 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,500 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,000 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,500 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,000 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,450 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,950 గా ఉంది.