News
News
X

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

వైఎస్ షర్మిల తో పాటు మరో ఆరు మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసును నమోదు
 వైఎస్ షర్మిల, హిందూజా రెడ్డి, సుధారాణి, ఎండి ముష్రాఫ్, బాషా, సంజీవ్ కుమార్, శీను లపై 143, 341, 290, 506, 509, 336, 382 r/w 149 సెక్షన్ల కింద ఫిర్యాదు చేసిన పంజాగుట్ట ఎస్సై అఖిల 
రాష్ అండ్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేస్తూ తమపైకు వాహనం దూసుకొచ్చేటట్టు షర్మిల నడిపినట్లు ఆరోపణలు 
అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్న గా వీడియో చిత్రీకరిస్తుండగా ఎస్సై మొబైల్ ఫోన్ లాక్కున్న షర్మిల 
డ్యూటీ చేస్తుండగా విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదు చేశారు

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ

AP New CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తారని, రెండు రోజుల కిందట ప్రచారం కాగా, తాజాగా జవహర్ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ పదవీ కాలం నవంబర్ 30తో ముగియనుండగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ భారీగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైన సీఎస్ నియామకంపై సీఎం ఫోకస్ చేశారు.

Breaking News: ఏపీ సీఎం జగన్ నివాసానికి అధునాతన పరికరాలతో భద్రత

ఏపీ సీఎం జగన్ నివాసానికి అధునాతన పరికరాలతో భద్రత కల్పించనున్నారు.
ఇదివరకే అందుబాటులోకి వచ్చిన  టైర్ కిల్లర్స్,  బొల్లార్డ్స్( Bollards,Tyre killers)...
మరో రెండు రోజుల్లో అధికారికంగా సెక్యూరిటి బలగాలకు అప్పగించనున్న ప్రైవేట్ సంస్ద

వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దు అని హైకోర్టు సూచించింది. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని సూచిస్తూ, పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

పీఎస్‌లో షర్మిల, లోటస్ పాండ్‌లో విజయమ్మ హౌస్ అరెస్ట్

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ కావడంతో ఆమెను పరామర్శించేందుకు తల్లి వైఎస్ విజయమ్మ ఎస్ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు యత్నించారు. కానీ పోలీసులు విజయమ్మను లోటస్ పాండ్‌లోని ఇంటిలో హౌస్ అరెస్ట్ చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, తన కూతుర్ని చూసేందుకు వెళ్లాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 

YS Sharmila Arrest: పంజాగుట్టలో వైఎస్ షర్మిల అరెస్టు

వైఎస్ షర్మిల మరోసారి అరెస్టు అయ్యారు. ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్తుండగా ముందస్తు సమాచారంతో షర్మిలను పోలీసులు పంజాగుట్ట వద్ద నిలువరించారు. అక్కడే ఆమెను అదుపులోకి తీసుకొని తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Current Shock: కరెంటు షాక్ తగిలి బాలిక మృతి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బస్వరాజు, జయంతిల కూతురు నిహారిక (10) నాలుగో తరగతి చదువుతుంది. ఇంట్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తూ విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. గ్రామంలోని ట్రాన్స్ ఫార్మార్ కు ఉన్న ఎర్తులు సరిగా పనిచేయకపోవడంతో ఈ సంఘటన జరిగిందన్నారు. గత 20 రోజుల నుండి కొన్ని ఇండ్లకు విద్యుత్ పాసై ఫ్యాన్లు, టీవీలు కాలిపోవడం జరిగిందని చెప్పారు. విషయాన్ని విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ఇది ముమ్మాటికీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి నిహారిక మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు అంటున్నారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే అంశంపై సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Tirumala News: శ్రీవారిని సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో కర్ణాటక సినీ హీరో దర్శన్, శ్రీకాళహస్తి వైసీపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే సతీష్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ శివరామరెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కర్ణాటక సినీ హీరో దర్శన్ మీడియాతో మాట్లాడుతూ. స్వామి వారి పొందేందుకు తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరి 26వ తేదీన క్రాంతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాట్లు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో క్రాంతి సినిమా విజయం సాధిస్తుందని దర్శన్ చెప్పారు.

Background

ఏపీకి కొద్ది రోజుల్లో వర్ష సూచన ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం సోమవారం (నవంబర్ 28) నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ బలపడుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. 

ఈ వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ కోస్తాలో ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడంతో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉన్నట్లుగా తెలిపారు. అటు మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. కళింగపట్నంలో 15.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

అదంతా ఫేక్ తుపాను నమ్మొద్దు - ఏపీ వెదర్ మ్యాన్
‘‘డిసెంబరు మొదటి వారంలో దక్షిణాంధ్రలో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వరకు మాత్రమే ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారి దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు వైపుగా వస్తోంది. దీని వలన డిసెంబరు 1 నుంచి నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. నెల్లూరు నగరంలో కూడ కొన్ని వర్షాలుంటాయి. డిసెంబరు 2 నుంచి 4 మధ్యలో తిరుపతి జిల్లాలోని అన్ని భాగాలు ముఖ్యంగా తిరుపతి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. అన్నమయ్య​, ప్రకాశం కోస్తా భాగాల్లో కూడా, చిత్తూరు జిల్లాలోని కొన్ని వర్షాలను చూడగలము. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప జిల్లాలో తక్కువగానే వర్షాలుండనున్నాయి. 

మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం ఉండదు. విశాఖ​, విజయవాడ​, కాకినాడ​, రాజమండ్రిలో కూడా వర్షాలు ఉండవు. ముఖ్యమైన గమనిక - విండీ యాప్ లో ఏదో తుఫాను ఆంధ్ర వైపుగా చూపిస్తూ ఉందని ఫేక్ న్యూస్ ఛానల్స్ చాలా దారుణంగా భారీ తుఫాన్ అని మరో పది రోజుల వరకు ఫేక్ న్యూస్ ని చెప్పనున్నారు. వాస్తవానికి ఈ సమయంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రా వైపుగా రావడం చాలా అరుదు. ఇంకా చాలా సమయం ఉంది. దయజేసి విండీ ఆప్, ఫేక్ న్యూస్ గాలులను నమ్మి భయపడకండి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 29) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 

నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.

టాప్ స్టోరీస్

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్