News
News
X

Breaking News Live Telugu Updates: బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం, ఐదుగురికి గాయాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం, ఐదుగురికి గాయాలు 

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పులగూర్తలో ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  క్షతగాత్రులను మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఆదేశించారు. మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యులను ఆదేశించారు.

Kadiam News: కడియం పోలీస్  క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం, గంజాయి దగ్దం

తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ క్వార్టర్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, బెల్లం, ఖైని, సారా కాసే పాత్రలు సహా పలు వస్తువులు తగలబడిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు . కడియం పోలీస్ స్టేషన్ వెనుక వైపుగల ఈ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఇటీవలే ఈ వస్తువులను అందులోకి మార్చి నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం ఈ వస్తువులు ఉన్న గదిలో నుంచి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను అదుపు చేసారు. ఇదిలా ఉండగా ఆ బిల్డింగ్లో కర్రెంట్ కూడా లేదని చెబుతున్నారు. దీంతో ప్రమాద కారణాలపై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా దక్షిణ మండలం డి ఎస్పీ ఎమ్ శ్రీ లతను సంప్రదించగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు.. దీనికేం జవాబు చెబుతావ్? - బండి సంజయ్
 • ట్విట్టర్ టిల్లు.. దీనికేం జవాబు చెబుతావ్? - బండి సంజయ్
 • చేనేతపై 5 శాతం జీఎస్టీ పెంచాలన్నది నువ్వే కదా
 • కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించిన బండి సంజయ్
 • చేనేత కార్మికులకు బతుకమ్మ చీరెలను నేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదు?
 • చేనేత వస్త్రాలపై అద్దె రంగులపై 50 శాతం సబ్సిడీ మాట ఎటు పోయింది?
 • ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్దాలు ప్రచారం చేస్తారా?
 • దుబ్బాక, హుజూరాబాద్ లో చెంప చెళ్లుమన్పించినా మారని టీఆర్ఎస్
 • పొరపాటున టీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కే ప్రమాదం
 • బండి సంజయ్ వ్యాఖ్యలు
ఈనెల 27 న గాజుల అలంకరణలో దుర్గమ్మ

ఈనెల 27 న బెజవాడ దుర్గమ్మను గాజులతో అలంకరించనున్నారు. ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి గాజులను బహూకరిస్తున్నారు. దీంతో ఇప్పటికే గాజుల అలంకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumala News: మంగళవారం సూర్యగ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత
 • మంగళవారం సూర్యగ్రహణం శ్రీవారి ఆలయం మూసివేత
 • గ్రహానికి 9 గంటలు మునుపే ఆలయాన్ని మూసి వేయడం ఆనవాయితీ 
 • రేపు ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ అధికారులు 
 • గ్రహణ విడుపు అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించనున్న అర్చకులు 
 • గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేయడంతో తిరుమలకి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరిన టీటీడీ
Tirumala News: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఆస్థానం అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా  'దీపావళి ఆస్థానాన్ని'  శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు. శ్రీవారి ఆలయ మరో ప్రధానార్చకులు కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివ‌రించారు.  

Loan Apps News: లోన్ యాప్‌ల వేధింపులకు మరో యువకుడు బలి, దీపావళి రోజు విషాదం

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ల వేధింపుల ఆగడాలకు మరో యువకుడు బలి అయ్యాడు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా వారిని అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లాలో దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోటకు చెందిన శేఖర్ ఓ రుణ యాప్ ద్వారా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు ఈఎంఐల రూపంలో చెల్లించే క్రమంలో ఆలస్యం అయింది. దీంతో రుణ యాప్ కు చెందిన నిర్వహకులు రోజూ ఫోన్ చేసి బాధితుడ్ని వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు, స్నేహితులకు నగ్న దృశ్యాలు పంపి వేధించడం మొదలు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

Background

బంగాళాఖాతంలో సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత​పెరుగుతోంది. వారం రోజుల వరకు తక్కువ వర్షాలు కురవనున్నాయి. అయితే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అక్టోబర్ చివరి నుంచి ఈశాన్య రుతుపవనాలు బలంగా మారి వర్షాలను అందిస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పు ఏపీకి తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఆపై బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. 

సిత్రాంగ్ తుపాను అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుంటుంది. ఆపై అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు.
సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు ఒడిశా, విదర్భా మీదుగా ఉపసంహరించుకుంటున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ చివరి నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో పలు జిల్లాల్లో చినుకు కూడా లేదు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి.

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు అంతగా కురవకపోయినా చలి తీవ్రత మాత్రం రాష్ట్రంలో పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లుల పడతాయి. సాధారణ వర్షాలున్నాయని, ఎలాంటి వార్నింగ్ జారీ చేయలేదు అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఏపీపై అంతగా లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రెండు రోజులు ఒక్కడక్కడా వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వర్షాలు చాలా తక్కువగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.