అన్వేషించండి

అది భారతీయ సంప్రదాయం- చెప్పులు అందివ్వడంపై బండి సంజయ్‌ క్లారిటీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 22 August AP CM Jagan Delhi Tour Updates అది భారతీయ సంప్రదాయం- చెప్పులు అందివ్వడంపై బండి సంజయ్‌ క్లారిటీ
బ్రేకింగ్ న్యూస్

Background

Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న సీఎం జగన్, ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ ఆదివారం సాయంత్రమే తాడేపల్లి నుంచి దిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రి దిల్లీ చేరుకుని జన్‌పథ్‌-1లో రాత్రి బస చేశారు. ఈ ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు.. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారని సమాచారం. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదలపై భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని సీఎం జగన్ కోరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారట. 

సీఎం జగన్ దిల్లీ టూర్ 

సీఎం జగన్ దిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. బీజేపీకి టీడీపీ దగ్గరవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సీఎం జగన్ ప్రధాని మోదీతో సహా అమిత్ షా భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లి జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో మరోసారి ప్రత్యేకంగా కలవాలని ప్రధానితో సీఎం చెప్పారు. దీంతో ఆదివారం సాయంత్రం సీఎం జగన్ దిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారని సమాచారం.  సీఎం జగన్ దిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. 

రాష్ట్రపతితో భేటీ! 

నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బీజేపీకి వైసీపీ కీలకంగా మారింది. దీంతో ఈ రెండు పార్టీలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టిపెట్టాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు వైసీపీ మద్దతు తెలిపింది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె సీఎం జగన్ గౌరవ సూచకంగా కలవనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తో సీఎం సమావేశం కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగ్ దీప్ ధన్ కర్ కు వైసీపీ మద్దతు తెలిపింది.  దిల్లీ పర్యటనలో  సీఎం జగన్ కీలక అంశాలపైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా పార్టీ నేతలు అంటున్నారు.  ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సవరించిన అంచనాలకు ఆమోదంపైన ప్రధానితో చర్చించారని తెలుస్తోంది.. 

పొత్తుపై క్లారిటీ! 

సీఎం జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల దిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధానితో కొద్దసేపు మాట్లాడారు. చంద్రబాబు మళ్లీ దిల్లీకి రావాలని ప్రధాని అన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో బీజేపీ, టీడీపీ మళ్లీ జట్టుకడుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ అలెర్ట్ అయింది. సీఎం జగన్ దిల్లీలో పర్యటనలో ఈ విషయాలపై ఓ క్లారిటీకి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది. కేంద్రంలో బీజేపీకే సపోర్టు చేస్తున్న వైసీపీపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తు్న్న విషయాన్ని బీజేపీ కీలక నేతల దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ పొత్తు రాజకీయాల పైనా ఈ పర్యటనలో సీఎం జగన్ ఓ క్లారిటీ తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 

15:21 PM (IST)  •  22 Aug 2022

అది భారతీయ సంప్రదాయం- చెప్పులు అందివ్వడంపై బండి సంజయ్‌ క్లారిటీ

దిల్లీ లిక్కర మాఫియాలో పడి కొట్టుకుంటున్న వాళ్లు డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫ్యామిలీ రహస్యాలు బయటపడకుండా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం... లేకుంటే కాళ్లు పట్టుకొని గుంజడం కేసీఆర్ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందివ్వడం భారతీయతను పాటించే తమకు అలవాటు అన్నారు. తమ కుటుంబ  పెద్ద, గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రికి చిన్నవాడినైన తాను చెప్పలు ఇవ్వడం గులామ్ గిరి ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

12:41 PM (IST)  •  22 Aug 2022

మధ్యప్రదేశ్‌లో స్కూల్ బస్‌ను ఢీకొట్టిన ట్రక్కు - నలుగురు విద్యార్థులు మృతి

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్‌ను ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. పదిమందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget