Breaking News Live Telugu Updates: కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి, నిజామాబాద్ జిల్లాలో ఘోరం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణలో క్రమంగా చలి తగ్గుతోంది. మొన్న మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ అవ్వగా.. నేడు రాష్ట్రమంతా సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కొనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడా ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
Warangal News: వరంగల్ సీపీ రంగనాథ్ ను కలిసి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా కాంగ్రెస్ యూత్ నాయకుడు పవన్ దాడిపై సీపీ రంగనాథ్ ను కలిసి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు
’’BRS నాయకుల దాడిని సీరియస్ తీసుకోవాలని సీపీకి చెప్పిన రేవంత్ రెడ్డి
నా పాదయాత్ర దగ్గర దాడి అంటేనే ఈ దాడిని కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీపై జరిగిన దాడిలాగానే చూడాలి
గంజాయి బ్యాచ్ యువకులు దాడి చేసీంది ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు ప్రోత్సహించారు
దాడి చేసే సమయంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే తమ్ముడితో మాట్లాడి దాడి చేశారు
దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుల ఫోన్ లపై విచారణ చేయాలి
లోతైన విచారణ జరిపి పూర్తి వాస్తవాలను బయట్టపెట్టే బాధ్యత పోలీసులదే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Surya Kumar Yadav: శ్రీవారి సేవలో సూర్య కుమార్ యాదవ్
తిరుమల శ్రీవారిని క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు.. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. ఆలయం వెలుపల అభిమానులు సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు..
BRS News: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు
త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గతంలో మాదిరి సీటు తమకే కేటాయించి తమకు మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎంఐఎం అభ్యర్థించింది. ఈ మేరకు, పార్టీ సీనియర్ల తో చర్చించి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Revanth Reddy: యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
హన్మకొండలోని ఏకశిలా ఆసుపత్రిలో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల చేతిలో తీవ్రంగా గాయపడ్డ యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు పరామర్శించారు. అనంతరం వరంగల్ కమిషనర్ ను కలిసి యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ పై దాడి చేసిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, అతని అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు.
Husnabad MLA: ఎండాకాలంలోపు గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభం - హుస్నాబాద్ ఎమ్మెల్యే
ఎండాకాలంలోపు ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గస్థాయి నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఉన్న నీటిపారుదల సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని, హుస్నాబాద్ నియోజకవర్గానికి "లక్ష్మి నియోజకవర్గం" అని పేరు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.