News
News
వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం, ఆ కంపెనీ ఓనర్‌పై ఏకంగా 40 చోట్ల

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
సీఎం జగన్ కొవ్వూరు పర్యటన మే 24కు వాయిదా

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా : రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత

వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా : రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత

' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తాం :  తానేటి వనిత

Tiruchanur News: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో మే 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 3వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 
ప్రారంభమైంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.  నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ  తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏవీఎస్ఓ శైలేంద్ర బాబు, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాస్చార్యులు, సూపర్డెంట్ మధుసూదన్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, అశోక్ ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Jubilee Hills News: జూబ్లీహిల్స్‌లో నీటి గుంతలో పడి బాలుడు మరణం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో విషాదం జరిగింది. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. బాలుడు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ACB News: ఏసీబీ వలలో బోడుప్పల్ విద్యుత్ ఏఈ ప్రసాద్ బాబు
  • ఏసీబీ వలలో బోడుప్పల్ విద్యుత్ ఏఈ ప్రసాద్ బాబు
  • చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్ వద్ద ప్యానల్ బోర్డ్ కోసం 10వేలు లంచం అడిగిన ప్రసాద్ రావు
  • లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏఈ ప్రసాద్ బాబు
  • విద్యుత్ సబ్ స్టేషనులో సోదాలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
Kakinada News: వైభవంగా సత్యదేవుని స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం

కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను కొండ కింద గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు బాజా బజంత్రీల మధ్య వైభవంగా తీసుకువచ్చారు. స్వామి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రభుత్వం తరుపున పట్టు వస్రాలు సమర్పించారు. అశేష భక్తజనం మధ్యన అత్యంత వైభవంగా స్వామి వారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, కార్యనిర్వహణాధికారి ఆజాద్, దేవస్థానం పాలక మండలి సభ్యులు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Hyderabad Income Tax Officer Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం, ఆ కంపెనీ ఓనర్‌పై ఏకంగా 40 చోట్ల

హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం మరోసారి రేగింది. కళామందిర్ వస్త్రవ్యాపారికి చెందిన ఇల్లు సహా దుకాణాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 40 చోట్ల ఒకే సమయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. 

Background

ఈ రోజు ద్రోణి /గాలి అనిచ్చితి  పశ్చిమ విదర్భ  నుండి  మరత్వాడ ,ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక  వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు  వరకు కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం, వడగళ్ళతో పాటు  రాగల మూడు రోజులు  రాష్ట్రంలో ఉరుములు,  మెరుపులు, ఈదురు గాలులు (గాలి 40 నుండి 50 కిమీ వేగంతో) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 

నేడు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, భారీ వర్షాలు, ఈదురు గాలులు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 88 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు భారీ వర్షం దక్షిణ కోస్తా, రాయసీమ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా మే నెలలో చలి కూడా మొదలైంది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 13 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైందంటే వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పును అంచనా వేయవచ్చు. గత 13 ఏళ్లలో ఇది రెండోసారి. అంతకుముందు 2021 సంవత్సరంలో కూడా, మేలో ఉష్ణోగ్రతలో బాగా తగ్గుదల నమోదైంది, భారీ వర్షాల కారణంగా, ఒకే రోజులో ఉష్ణోగ్రత 23 డిగ్రీలు పడిపోయింది.
 
ఢిల్లీ సఫ్దర్‌జంగ్ స్టాండర్డ్ అబ్జర్వేటరీ ప్రకారం, గత 24 గంటల్లో, సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 14.8 మిల్లీలీటర్ల వర్షం నమోదైంది. అదే సమయంలో ఢిల్లీ యూనివర్శిటీ సమీపంలోని రిడ్జ్ ప్రాంతంలో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ విభాగం (IMD) యొక్క డేటా ప్రకారం, 2021 సంవత్సరంలో, ఏప్రిల్‌లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం కారణంగా, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. 2011 నుండి, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ రెండుసార్లు మాత్రమే నమోదైంది.

IMD ఎల్లో అలర్ట్
ఈరోజు, రేపు ఢిల్లీకి IMD ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. గురువారం కూడా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో కొన్ని చోట్ల చినుకులు పడే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.