By : ABP Desam | Updated: 19 Dec 2022 11:36 PM (IST)
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిన్మార్ మల్లన్న యాత్ర
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎన్.టి.ఆర్.చౌరస్తాలో తీన్మార్ మల్లన్న రోడ్ షో నిర్వహించారు. 7200 ఖండువాలతో రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య తో కలిసి తిన్మార్ మల్లన్న పర్యటించారు. ఈ సందర్భంగా తన యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న కేసీఆర్ ఇచ్చే రైతు బంధు డబ్బులు డిసెంబర్ 31వ తేదిన కొత్త సంవత్సరానికి దావత్ కోసమేనని అన్నారు. రైతులు తాగాలి ఊగాలి అని సంచలన వ్యఖ్యాలు చేశారు. తీన్మార్ మల్లన్న యాత్ర చేస్తే ప్రజలకు కేసీఆర్ చేసే దొంగపనులు బయట పడతాయని, అందుకే యాత్రకు అడ్డుపుల్ల వేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పిఎం కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని పలువురు కార్మికులు తిన్మార్ మల్లన్న దృష్టికి తిసుకురాగా ఉదయం సిర్పూర్ పేపర్ మిల్లు వద్దకు చేరుకొని అందరితో మాట్లాడాతానన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో కార్పొరేటర్ అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడ్ని దుండగులు హత్య చేశారు. ఎమ్ఐఎమ్ కార్పొరేటర్ కార్యాలయంలో దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
హైదరాబాద్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తుంది. విచారణకు హాజరయ్యేందుకు రోహిత్ రెడ్డి గడువు అడగగా అందుకు ఈడీ అధికారులు తిరస్కరించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వినతిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించింది. విచారణకు రావాల్సిందేనని ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటించారు. లంబసింగి వద్ద మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ ఛైర్ పర్సన్ సుభద్రతో కలిసి డ్యాన్స్ చేశారు. ఏజెన్సీ సంప్రదాయమైన థింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు. థింసా నృత్యానికి స్టెప్పులేసిన రోజా విశేషంగా ఆకట్టుకున్నారు. పలు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి రోజా తనదైన శైలిలో ప్రత్యర్ధులకు విమర్శంచడంలో చెయ్యడంలో దూకుడు ప్రదర్శిస్తూనే ... తన హావభావాలతో అలరించడంతో జరిగే కార్యక్రమాల్లో రోజా హైలెట్ గా నిలుస్తున్నారు.
బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని నేడు ఈడీ విచారణ చేయాల్సి ఉండగా, ఆయన హాజరు కావడం లేదు. ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు తనకు ఇంకా సమయం కావాలని రోహిత్ రెడ్డి ఈడీకి లేఖ రాశారు. ఈ నెల 25 సమయం ఇవ్వాలని కోరారు. అంతకుముందు రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గత శుక్రవారం నాడు రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ రెడ్డి తాజాగా చేసిన వినతిపై ఈడీ అధికారులు అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
బంగాళాఖాతంలోని ఆగ్నేయ భాగంలో ఏర్పడ్డ బలమైన అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి ఆదివారం (డిసెంబరు 18) నాటికి దక్షిణ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని తెలిపారు. వచ్చే 3 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. అలా శ్రీలంక తీరం వైపుగా కదులుతుందని అంచనా వేశారు. దీని ప్రభావం అధికంగా తమిళనాడుపైన ఉంటుందని వెల్లడించారు.
ఈ నెల 20వ తేదీ నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడతాయని, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.
‘‘ఈ వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఈ వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా లేదు. దీని కోసం ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ ని ఇస్తాను. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుంది.
1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదు.
2) వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉన్నది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తర కోస్తా, యానాం
వచ్చే మూడు రోజులు (ఆది, సోమ, మంగళవారం) పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర
వచ్చే మూడు రోజులు (ఆది, సోమ, మంగళవారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ
వచ్చే మూడు రోజులు (ఆది, సోమ, మంగళవారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?