అన్వేషించండి

Breaking News Live Telugu Updates: వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ బుధవారానికి వాయిదా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ బుధవారానికి వాయిదా

Background

నిన్న దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉన్న ద్రోణి/గాలిలోని అనిచ్చితి, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీల మధ్యన  కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల  కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో)  వీచే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 50 శాతం నమోదైంది. 

ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.

‘‘రాష్ట్రంలో ఎండలు మరింత విపరీతం కానున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో విశాఖకి తూర్పుగా అధిక పీడన ప్రాంతం కొనసాగుతోంది. దీని వలన పొడిగాలుల తీవ్రత పెరిగి రానున్న మూడు రోజుల వ్యవధిలో మధ్య ఆంధ్రా ప్రాంతం అయిన ఎన్టీఆర్ (విజయవాడ వైపు), గుంటూరు, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, కడప​, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో వేడి 44-45 డిగ్రీల వరకు పలు భాగాల్లో నమోదవ్వనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేడి 40 వరకు ఉండనుంది. అలాగే కృష్ణా, కొనసీమ​, బాపట్ల​, కాకినాడ జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్యలోనే వేడి కొనసాగుతుంది. విశాఖ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు ఉండనుంది. వేడి తీవ్రత మరో మూడు రోజుల వరకు కొనసాగనుంది.

ఢిల్లీలో విపరీతమైన ఎండలు

సోమవారం (ఏప్రిల్ 17) వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని చాలా రాష్ట్రాలు వేడిగాలుల ఉచ్చులో ఉంటాయని అంచనా. IMD ప్రకారం, రాబోయే 4 రోజులు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేశంలోని వాయువ్య ప్రాంతంలో రెండు రోజుల పాటు వేడి గాలులు కొనసాగుతాయి.

20:47 PM (IST)  •  18 Apr 2023

50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని ప్రచారం, ఖండించిన టీటీడీ

ఉనికి కోసమే  వారి ఉబలాటం 
- బంగారు మలాం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని దుష్ప్రచారం టీటీడీ ఖండన.

    శ్రీగోవింద రాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని హిందూ జన శక్తి  సంస్థకు చెందిన లలిత్ కుమార్, ఆదిపట్ల కళాపీఠం అధ్యక్ష్యురాలు కరాటే కల్యాణి సోమవారం ( 17-4-2023) న టీటీడీపై అవాస్తవ ఆరోపణలు చేశారు.  తమ ఉనికిని చాటుకోవడానికి వారు చేసిన నానా యాగీని తీవ్రంగా ఖండిస్తున్నాము.
       బంగారు తాపడం పనులు జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు ప్రాంగణంలో 24 గంటలూ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. సంబంధిత సిబ్బంది లోనికి వెళ్ళాలన్నా. రిజిస్టర్ లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసే వెళ్ళాలి. ఇది నిషిద్ధ ప్రాంతం. స్ట్రాంగ్ రూమ్, పనిజరిగే ప్రాంతం లో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుంది. ఇంతటి పటిష్టమైన ప్రాంతం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం వారి అజ్ఞానానికి, ప్రచార యావకు నిదర్శనం. 
    ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు,అర్చకుల సలహాలు తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ శిల్పసంపదకు ఇబ్బంది కలిగించే ఆస్కారమే లేదు. ఈ విషయం తెలుసుకోకుండా సదరు వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో ఆరోపణలు చేయడం మంచిది కాదు. 
   గోల్డ్ మలాం పనులు  చేసే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రదేశం( ఇది గోల్డ్ మలాం పనులు జరిగే ప్రాంతం కాదు ) లో బంగారు మలాం పనులు చేసే కాంట్రాక్టర్ జ్యోతికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చారు. సదరు వ్యక్తులు ఈ సమయంలో అతన్ని పట్టుకుని యాగీ చేశారు. గోల్డ్ మలాం పనులకు అతనికి ఏ మాత్రం సంబంధం లేదు. అతనికి ఎలాంటి సబ్ కాంట్రాక్టు ఇవ్వలేదు. పబ్లిసిటీ  పిచ్చితో ఇలాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరడమైనది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

17:36 PM (IST)  •  18 Apr 2023

విజయనగరం జిల్లా రాజాంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయనగరం జిల్లా రాజాంలోని GMRVF క్యాంపస్‌లో నాబార్డు మద్దతుతో కూడిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని మంగళవారం సందర్శించారు.   రిఫ్రిజిరేషన్z ఎయిర్ కండిషనింగ్ కోర్సులో శిక్షణ పొందిన వారితో సంభాషించారు.  విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ,  జీవనోపాధి, ఉపాధిని కనుగొనడంలో దోహదపడుతుందని ఆయన సూచించారు.  పారిశ్రామికవేత్తగా ఎదగాలని, ఇతరులకు ఉపాధి కల్పించాలని సూచించారు. నాబార్డు డిడిఎం టి.నాగార్జున వ్యవసాయం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలలో నాబార్డు అభివృద్ధి పనుల గురించి వివరించారు.

16:32 PM (IST)  •  18 Apr 2023

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 6 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల కస్టడీకి కోర్టు అనుమతించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లకు ఆరు రోజుల కస్టడీకి అనుతించింది కోర్టు. రేపటి నుంచి 24వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి ఇవ్వనున్నారు. 

15:48 PM (IST)  •  18 Apr 2023

వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ బుధవారానికి వాయిదా

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది. బుధవారం ఉదయం 10.30కు హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని సీబీఐ సూచించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సీబీఐ విచారణ రేపటికి వాయిదా వేశారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామన్న సీబీఐ అధికారులు.

14:03 PM (IST)  •  18 Apr 2023

Cricket Betting: హైదరాబాద్ ఐపీఎల్ బెట్టింగ్ ముఠాలు అరెస్టు

  • రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న రెండు ముటాలను అరెస్టు చేసిన పోలీసులు
  • RCB Vs CHENNAI SUPER KINGS క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 46 లక్షలు స్వాధీనం
  • మరికొందరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామన్న రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి 
Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Alluri Seetarama Raju District News: జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Embed widget