Breaking News Live Telugu Updates: ముగిసిన వైసీపీ విస్తృతసాయి సమావేశం, పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
నేడు తెలంగాణలో సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.
కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో తెలంగాణలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.
ఎల్లో అలర్ట్ ఈ 20 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు సహా మొత్తం 20 జిల్లాల్లో నేడు చలి ఎక్కువ ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పారు. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వచ్చే 5 రోజులు రాత్రిపూట చలి పెరుగుతుందని, పగటిపూట ఎండ కూడా పెరుగుతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
ఇక మహబూబ్ నగర్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కడ 36.9 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 12.2 డిగ్రీలు నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేశారు.
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.
ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ముగిసిన వైసీపీ విస్తృతసాయి సమావేశం, పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం
ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. 30 మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకు వెళ్లడంలేదని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడ్ ఉన్న ప్రాంతంలో గడప గడపకి బ్రేక్ ఇచ్చి తర్వాత కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 20న జరిగే మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.
రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టరు- మంత్రి వేణుగోపాల్
ఏ రాష్ట్రంలోనైనా రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టరు. పరిపాలన చూసి పెట్టుబడులు పెడతారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతే రాజధాని అన్నారు. ఒక రాజధానినే కొనసాగించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయం, ప్రజల అభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం శివరామకృష్ణ కమిషన్ వేశారు. కానీ ఆ కమిషన్ చెప్పిన విషయాలను, సూచనలను పట్టించుకోకుండా తనకు కావాల్సిన తీరుగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తనకు కావాల్సిన విధంగా కమిషన్ నియమించి, తనకు నచ్చినట్లుగా రాజధాని నిర్మాణం మొదలుపెట్టి.. అందరూ అది ఒప్పుకోవాలని బలవంతం చేయడం సరికాదన్నారు మంత్రి వేణుగోపాల్.
సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా
రేపటి సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారని తెలుస్తోంది. మంగళవారం రద్దీ దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమచారం.
WPL Auction 2023: యువ కెరటం జెమీకి రూ.2.2 కోట్లు.. షెఫాలీ కేక
టీమ్‌ఇండియా యువ కెరటం జెమీమా రోడ్రిగ్స్‌ను రూ.2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను రూ.1.1 కోట్లకు కైవసం చేసుకుంది. డ్యాషింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మను రూ.2 కోట్లు పెట్టి తీసుకుంది.
WPL Auction 2023: రన్ మెషీన్ మూనీ గుజరాత్‌కు!
ఆస్ట్రేలియా రన్ మెషీన్ బెత్‌మూనీని గుజరాత్ దక్కించుకుంది. రూ.2 కోట్లకు తీసుకుంది. అమెలియా కెర్‌ను రూ.1 కోటికి ముంబయి దక్కించుకుంది. సోఫియా డాంక్లీని గుజరాత్ రూ.60 లక్షలకు తీసుకుంది.