అన్వేషించండి

Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమే - కేంద్రం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 12 December CM KCR CM Jagan Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమే - కేంద్రం 
ప్రతీకాత్మక చిత్రం

Background

ఉత్తర తమిళనాడు మీదుగా ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం మరింత బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీని కారణంగా తమిళనాడుతోపాటు దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. మాండౌస్ తుపాను బలహీన పడి కర్ణాటక మంగళూరు ప్రాంతం దగ్గరగా అల్పపీడనంగా కొనసాగుతోంది. 

అల్పపీడనం కారణంగా ఫుల్‌గా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమతోపాటు నెల్లూరుసహా కోస్తా ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోనున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి. రెండు రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతోంది వాతావరణ శాఖ. 

వివిధ ప్రాంతాల్లోకురిసిన వర్షపాతాలు ఇలా ఉన్నాయి.

ఆత్మకూరు(నెల్లూరు జిల్లా)-13, మార్కాపూర్ (ప్రకాశం జిల్లా) 10, అమలాపురం (తూర్పుగోదావరి జిల్లా) 10, వెలిగండ్ల (ప్రకాశం జిల్లా) 9, కందుకూరు (ప్రకాశం జిల్లా) 9, మర్రిపూడి (ప్రకాశం జిల్లా) 8, ఒంగోలు (ప్రకాశం జిల్లా) 8, ఉదయగిరి (నెల్లూరు జిల్లా) 8, పొదిలి (ప్రకాశం జిల్లా) 7, అవనిగడ్డ (కృష్ణా జిల్లా) 7, కొనకనమిట్ల (ప్రకాశం జిల్లా) 7; తంబళ్లపల్లె (చిత్తూరు) 7, వెంకటగిరి కోట (చిత్తూరు జిల్లా) 7, పెనగలూరు (వైఎస్ఆర్ జిల్లా) 7, ఆరోగ్యవరం (చిత్తూరు జిల్లా) 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 

మాండౌస్‌ తుపాను అరేబియాలోకి వెళ్లి అల్పపీడనంగా కొనసాగుతున్నందున... బంగాళాఖాతంలో ఉన్న తేమ గాలులను లాక్కుంటుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. 

వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు

ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చు. 
కృష్ణా, గుంటూరు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ వెదర్‌ మ్యాన్ చెప్పారు. విశాఖలో తుంపరులు పడొచ్చు. 

కేరళకు ఆనుకొని ఈ అల్పపీడనం ఒకట్రెండు రోజుల్లో ఏర్పడ వచ్చని చెబుతోంది. దీని ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 

తెలంగాణలో వాతావరణం 
మాండౌస్‌ ప్రభావం తెలంగాణపై కూడా ఉంది. దక్షిణ తెలంగాణలో ఇప్పటికే జోరు వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉండొచ్చని అంచనా. ఉత్తర తెలంగాణలో చాలా తక్కువ ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మిగతా జిల్లాల్లో చలి తీవ్ర పెరగొచ్చు. 

13వ తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. 14వ తేదీ నాటికి పూర్తిగా వర్షాలు తగ్గుముఖ పట్టనున్నాయి. అయితే బంగాళాఖాతంలో త్వరలోనే మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఎలా ప్రయాణిస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇది శ్రీలంక మీదుగా వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని కొన్ని రాడార్స్ చెబుతుంటే.. లేదు కేరళపై ఎఫెక్ట్ ఉంటుందని మరికొన్ని చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ఏపీ వెదర్‌మ్యాన్ చెబుతున్నారు. 

16:18 PM (IST)  •  12 Dec 2022

పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమే - కేంద్రం 

పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై  రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని కేంద్రం తెలిపింది. కానీ పలు కారణాల దృష్ట్యా ఈ గడువులోపు ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని వెల్లడించింది.  

15:37 PM (IST)  •  12 Dec 2022

Pawan Kalyan Varahi Vehicle: పవన్ కళ్యాణ్ వాహనం వారాహికి గ్రీన్ సిగ్నల్

  • వారాహి రిజిస్ట్రేషన్ కు తెలంగాణ రవాణా శాఖ అనుమతి
  • వాహనాలకు ఆలివ్ గ్రీన్ వాడొద్దని రూల్ ఉంది
  • వారాహి రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్ధారించిన అధికారులు
  • వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను పరిశీలించాం
  • ఆలివ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ మధ్య సిమిలారిటీ ఉంది
  • మా దగ్గరకు వచ్చినప్పుడు అన్ని నిబంధనలు ఉన్నాయి
  • నిబంధనల ప్రకారం వాహనం రంగు ఉండటంతో అనుమతించిన అధికారులు
  • అందుకే అనుమతినిచ్చాం
  • వారం రోజుల క్రితమే TS 13 EX 8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తి
  • ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ తెలంగాణ పాపారావు
Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Embed widget