News
News
X

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

తదుపరి సీజేఐగా సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌ ) నియమితులయ్యారు. ఆయన పేరును రికమండ్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేసిన మరుసటి రోజు (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. 

గోరంట్ల మాధవ్‌ పేరుతో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ది కాదు: పోలీసులు

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. అది ఒరిజినల్ కాదని ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియో స్క్రీన్ రికార్డు మాత్రమే అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. నాల్గో తేదీ అర్థరాత్రి 2 గంటలకు ఈ వీడియోను మొదట ఐ టీడీపీలో పోస్టు చేశారని... ఓ ఫారెన్ నెంబర్ నుంచి ఫార్వర్డ్ అయిందన్నారు. వీడియోకు సంబంధించిన బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అసలు ఆ వీడియోలో ఉంది గోరంట్ల మాధవ్ అవునో కాదో అని పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. 

Nampalli Court: పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు పదేళ్ల జైలు శిక్ష
 • ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు
 • 2016 లో తన క్లినిక్ కు వచ్చిన ఒక పేషంట్ పై అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు
 • ట్రీట్మెంట్ లో భాగం అని చెప్పి బాధితురాలితో అసభ్య ప్రవర్తన 
 • ఇతర పేషంట్ లపై సైతం అదే రీతిలో వ్యవహరించిన వైద్యుడు
 • 2016 లో గోపాలపురం పోలీస్ లకు బాధితురాలి ఫిర్యాదు
 • ఛార్జ్ షీట్ దాఖలు చేసి సరైన ఆధారాలు సమర్పించిన పోలీసులు
 • ప్రముఖ పల్మనాలజీస్ట్  విజయ్ భాస్కర్ కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధింపు
Supreme Court Grants Bail To Varavara Rao: విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్

విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న 82 ఏళ్ల వరవరరావుకు బెయిల్ మంజూరు చేశారు.

Palnadu District: నరసరావుపేటలో 1000 మీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన
 • పల్నాడు జిల్లా నరసరావుపేటలో 1000 మీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన
 • ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ జెండా ప్రదర్శన
 • ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివ శంకర్
 • జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు
 • SSN కళాశాల నుండి స్టేడియం వరకూ భారీ ర్యాలీ లో పాల్గొన్న విద్యార్థులు
Anantapur: అనుమానాస్పద స్థితిలో  చిరుతపులి మృతి

శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున  అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి చెందింది.  గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతపులులు సంచరిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన మరింత భయాందోళనకు గురి చేసింది. చిరుతపులి  శరీరంపై గాయాలు ఉండడంతో కొండపై భాగం నుంచి కిందకు జారిపడి గాయాలయ్యాయా,  లేక ఏదైనా వాహనం ఢీ కొట్టి ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.  గతంలో పలు సందర్భాల్లో చిరుతపుల నుంచి తమను కాపాడాలని నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విన్నవించుకున్నా పట్టించుకోని అటవీశాఖ అధికారులపై  స్థానికులు  మండిపడుతున్నారు.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాలేపల్లి,  కైరేవు ,చెర్లోపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు

Kamareddy District: ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని చెరువులో దూకిన యువతి

కామారెడ్డి జిల్లాలో భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పంచశీల (20) అనే యువతి డిగ్రీ పూర్తి చేసింది. పంచశీల హైదరాబాద్‌లో ఉంటూ మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ టెస్టు రాసింది. ఆ పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో యువతి ప్రాణాలు తీసుకుంది. మృతురాలు మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారగా, నేడు తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై నెలకొంది. తీవ్ర వాయుగుండం క్రమంగా కదులుతూ ఛత్తీస్ గఢ్- వైపు వెళ్తోంది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తూర్పు పశ్చిమ షియర్ జోన్ 20 డిగ్రీల ఉత్తర అక్షాంశంతో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కి.మీ మధ్యలో ఉందని అధికారులు వెల్లడించారు. 

తెలంగాణలో మోస్తరు వర్షాలు
ఇదివరకే వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయిని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
నేడు వాయుగుండం తీవ్రరూపం దాల్చనుండగా, దీని ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై ఉంది.  అదే సమయంలో తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. నేడు ఉత్తర కోస్తాంధ్ర లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. 3 జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సైతం వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. యానాంలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!