Breaking News Live Telugu Updates: చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు పెరిగాయి. ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళలో చలి కాస్త పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని డిసెంబరు 28 నాటి వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
మన్యం జిల్లాలో పెరుగుతున్న చలి
మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మూడు రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. చింతపల్లి 10, లంబసింగి 8, డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పాడేరు, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పదిన్నర గంటల వరకు కూడా పొగ మంచు దట్టంగా కనిపిస్తుండగా, ఆ తరువాత నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఎండ కాస్తున్నది. మళ్లీ నాలుగు గంటల నుంచి యథావిథిగా చలి మొదలవుతుంది.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 19.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన మరవక ముందే, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు మహిళలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగించిన అనంతరం అక్కడినుంచి వెళ్లిపోగా, పంపిణీలో గందరగోళం నెలకొంది. కానుకల కోసం మహిళలు భారీగా తరలిరావడంతో సంక్రాంతి కానుక పంపిణీ కేంద్రం దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా,, మరికొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
చంద్రబాబు గుంటూరు సభలో తోపులాట, పలువురు మహిళలకు గాయాలు
ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన మరవక ముందే, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరో సభలో మళ్లీ తోపులాట జరిగింది. చంద్రబాబు గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగించిన అనంతరం అక్కడినుంచి వెళ్లిపోగా, పంపిణీలో గందరగోళం నెలకొంది. కానుకల కోసం మహిళలు భారీగా తరలిరావడంతో సంక్రాంతి కానుక పంపిణీ కేంద్రం దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోగా, మరికొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఏపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి, తదితరులు
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. కొన్ని రోజుల కిందట ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు సైతం దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఏపీ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీ నుంచి ఓ మాజీ మంత్రితో పాటు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి జనవరి 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో వీరితో పాటు మరికొందరు గులాబీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విద్యార్థి, యువజన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఓ ప్రకటనలో తెలిపారు.
Traffic Violations: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు సస్పెండ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5819 వాహనదారుల లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగా కూడా భారీ ఎత్తున లైసెన్సులను రద్దు చేసింది. హైదరాబాద్ రవాణా శాఖ నార్త్ జోన్ లో 1103, సౌత్ జోన్ లో 1151, ఈస్ట్ జోన్ లో 510 మరియు వెస్ట్ జోన్ లో 1345 లైసెన్సులు రద్దయ్యాయి. 2021 ఏడాదితో పోల్చుకుంటే ఈ కొత్త ఏడాదిలో 3,220 వాహనదారుల లైసెన్స్ సస్పెండ్ చేసినట్లుగా పోలీసులు చెప్పారు.
New Year Celebrations: మద్యం మత్తులో యువకుల హల్ చల్
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోవా ఫిష్టా న్యూ ఇయర్ వేడుకల్లో కొందరు యువకులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో ఒకరిపై మరొకరు బీరు బాటిల్స్, కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ సెట్టింగ్ ని కూడా పడగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.