Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతాల్లో నేడు వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేదు. నేడు కూడా ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో అర్ధరాత్రి వేళ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఉమ్మడి విశాఖ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండల్లాలో భారీ వర్షం పడింది. అనకాపల్లి, చోడవరం, వడ్డాది, మాడుగుల, చీడికాడ, విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం వల్ల కొన్ని చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా, రాత్రి వాన పడింది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 4 రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు ఇంకా పెరిగింది. నేడు గ్రాముకు ఏకంగా రూ.15 చొప్పున పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,250 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,500 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,500 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,250గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,500 గా ఉంది.
విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
17 మంది మంత్రుల సామాజిక న్యాయభేరి బస్ యాత్ర భారీ వర్షం కారణంగా రద్దు అయింది. విజయనగరం పట్టణంలోకి మంత్రుల బస్సు చేరుకునేసరికి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో సభ నుంచి కార్యకర్తలు, ప్రజలు ఇంటి ముఖం పట్టారు. సభ వద్దకు చేరుకున్న బస్సులోంచి మంత్రులు దిగటానకి కూడా వీలులేకుండా వర్షం కురిసింది. దీంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. చివరికి స్టేజీ మీదకి మంత్రులు వచ్చే సరికి ప్రజలు ఎవరు లేకపోవడంతో, సభ రద్దు చేసుకొని తిరిగి బస్ లో మంత్రులు వెళ్లిపోయారు. రేపటి యాత్ర కోసం బస్ విశాఖపట్నం వెళ్లిపోంది. భారీ జన సమీకరణ జరిగిన సభ రద్దు అవ్వడంతో స్థానిక నేతలు నిరాశ చెందారు.
విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
17 మంది మంత్రుల సామాజిక న్యాయభేరి బస్ యాత్ర భారీ వర్షం కారణంగా రద్దు అయింది. విజయనగరం పట్టణంలోకి మంత్రుల బస్సు చేరుకునేసరికి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో సభ నుంచి కార్యకర్తలు, ప్రజలు ఇంటి ముఖం పట్టారు. సభ వద్దకు చేరుకున్న బస్సులోంచి మంత్రులు దిగటానకి కూడా వీలులేకుండా వర్షం కురిసింది. దీంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. చివరికి స్టేజీ మీదకి మంత్రులు వచ్చే సరికి ప్రజలు ఎవరు లేకపోవడంతో, సభ రద్దు చేసుకొని తిరిగి బస్ లో మంత్రులు వెళ్లిపోయారు. రేపటి యాత్ర కోసం బస్ విశాఖపట్నం వెళ్లిపోంది. భారీ జన సమీకరణ జరిగిన సభ రద్దు అవ్వడంతో స్థానిక నేతలు నిరాశ చెందారు.
CM Stalin : కేంద్రం నిధులు ఇవ్వడంలేదు, ప్రధాని మోదీ ముందే తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
CM Stalin : కేంద్రం నుంచి తమిళనాడుకు నిధులు రావడంలేదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ప్రధాని మోదీ ముందే సీఎం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి ద్రవిడియన్ స్టైల్ పాలన చూపిస్తామన్నారు. రాష్ట్రాలతో కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం అన్నారు. అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తున్నారు కానీ నిధులు ఇవ్వడంలేదన ప్రధాని ముందే సీఎం స్టాలిన్ అన్నారు.
Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం, సాంకేతిక సమస్యతో నిలిచిన రైలు
Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో రైలు సాంకేతిక సమస్యలో నిలిచిపోయింది. దీంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రో కారిడార్‌లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మెట్రో స్టేషన్లలో భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచిచూడడంతో రద్దీ నెలకొంది.
సత్తెనపల్లిలో రూ.11 లక్షల విలువైన అక్రమ మద్యం ధ్వంసం
Sattenapalli : పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధిలోని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అక్రమ మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. సీజ్ చేసిన 14 వందల లీటర్లు, సుమారు రూ.11 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, సెబ్ సీఐ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం చేశారు.