IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Breaking News Live: తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ ముట్టడి.. పోలీసుల భారీ బందోబస్తు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

FOLLOW US: 
తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ ముట్టడి.. పోలీసుల భారీ బందోబస్తు

తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగిన ఘటనతో తెలంగాణ భవన్ ముందు ఆయన నిరసన తెలియజేయడానికి వస్తున్నాడన్న సమాచారంతో బందోబస్తుని పెంచారు. తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్


హైదరాబాద్ కమిషనర్ గా ఐపీఎస్ సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను ఏసీబీ డీజీపీగా నియమించింది. అదే స్థాయంలో సీవీ ఆనంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంద్రం పడినట్లు తెలుస్తోంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఏర్పడిన రంద్రం వల్ల ఉక్కు ద్రవం నేలపాలైంది. అందులోనూ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలల్లో రెండు లారీలు దగ్ధమైనట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో నలభై నుండి యాభై లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న భారత్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ రెండో రోజు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు మంత్రులు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను భారత్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. మూడురోజుల పర్యటనకు ఏపీ వచ్చిన ఆయన... తొలి రోజు స్వగ్రామ పొన్నవరంలో పర్యటించారు. అక్కడ గ్రామస్థుల చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ చేరుకున్నారు. 

Background

రెండు వైపుల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఓ వైపు తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి వీచే గాలులతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్ర నేటి నుంచి తగ్గే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఉదయం వేళ ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చల్లటి తేమతో కూడిన గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని చోట్ల ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో చలి గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదు కానున్నాయని అంచనా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. బంగారం ధర ఇటీవల రూ.200 మేర పెరగగా, నిన్న ధరలో ఏ మార్పు లేదు. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,350 కాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,480 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,100కి పడిపోయింది. ఇటీవల 65 వేల దిగువకు పడిపోయిన వెండి ధరలు  మళ్లీ పెరుగుతున్నాయి.

ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.200 మేర పెరగగా, వెండి ధరలు దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,480 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,350కు చేరింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350 కు ఎగబాకింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,100గా ఉంది.

ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ధరలు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ ఒకే ధర ఉంది. నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.69 కాగా... డీజిల్ ధర రూ.94.14 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ లో పెట్రోల్ ధర 0.32 పైసలు తగ్గగా, డీజిల్‌పై 0.30 పైసల మేర తగ్గింది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.07 కాగా, డీజిల్ ధర రూ.94.49 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.16 పైసలు పెరిగి రూ.109.93 అయింది. డీజిల్ ధర రూ.0.15 పైసలు పెరగడంతో రూ.96.38 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.110.29 అయింది. డీజిల్ ధర రూ.96.36గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.17 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.22 కి చేరింది. డీజిల్ ధర 0.16 పైసల పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.34 అయింది.

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

LSG vs RCB, Eliminator: బ్యాడ్‌ న్యూస్‌! వర్షంతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యం

LSG vs RCB, Eliminator: బ్యాడ్‌ న్యూస్‌! వర్షంతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యం

MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !

MLC Suspend YSRCP :  ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం