అన్వేషించండి

JC Diwakar Reddy In TS Assembly: ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా... తెలంగాణ అసెంబ్లీలో జేసీ దివాకర్ రెడ్డి... రాయలసీమ తెలంగాణలో ఉంటే బాగుండేదని ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ టీడీపీ నేత తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. పాత మిత్రులను పలకరిస్తూ... సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు. విలేఖరులతో చిట్ చాట్ గా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీలో పాత్ర మిత్రులందరినీ కలిశానని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను వదిలిపెట్టి తాను చాలా నష్టపోయానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.

Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. ముగిసిన బీఏసీ భేటీ, కాంగ్రెస్ కొత్త డిమాండ్

రాయల తెలంగాణ కోసం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌తో శాసనసభ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి కలిసి పలు అంశాలపై మాట్లాడారు. అంతకు ముందు సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులతో జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ నేత జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పానన్నారు. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసన్న ఆయన... తనకు జానారెడ్డి మంచి మిత్రుడని తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదన్న ఆయన రాజకీయాలు బాగోలేవని, సమాజం కూడా బాగోలేదన్నారు. ఏపీ వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయామన్నారు. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని జేసీ వ్యాఖ్యానించారు.

Watch Video : జేసీ Vs కేతిరెడ్డి.. దశాబ్దాల తా'ఢీ'పత్రి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

తెలంగాణతో కలిసి ఉంటే

అనంతరం విలేఖరులతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన తాను రాజకీయంగా ఎదిగింది కాంగ్రెస్‌లోనే అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు కలిశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న ఆయన... రాయలసీమ కూడా తెలంగాణతో కలిసి ఉంటే బాగుండేదని కేసీఆర్‌తో చెప్పానని పేర్కొన్నారు.

Watch Video : అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? జేసీ ధ్వజం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget