By : ABP Desam | Updated: 06 Mar 2022 06:23 PM (IST)
బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఆదివారం కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
మరి కాసేపట్లో తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. కేబినేట్ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరుగుతున్నాయి.
శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది.
మహిళాభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే పి శేఖర్ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని భువనగిరిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళా సోదరీమణులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మహిళలకు మర్యాదపూర్వక సన్మానం చేశారు.
శ్రీకాకుళం పట్టణంలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దమ్మల వీధిలో నివాసం ఉంటున్న పేర్ల ధనలక్ష్మి, పిల్లలు పేర్ల సోనియా, యశ్వంత్ లు మృతి చెందారు. కుటుంబ కలహాలతో తల్లి వద్ద ఉంటున్న ధనలక్ష్మి ఆదివారం ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gun Fire At BSF Camp: బీఎస్ఎఫ్ క్యాంపులో ఓ జవాను కాల్పులు జరపడంతో విషాదం జరిగింది. తోటి సిబ్బందిపై సీటీ సత్తెప్ప ఎస్కే కాల్పులు జరపగా ఐదుగురు జవాన్లు చనిపోగా, మరో 6 మంది జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. అమృత్సర్ బీఎస్ఎఫ్ క్యాంపులో ఆదివారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో కాల్పులు జరిపిన జవాను సత్తెప్ప కూడా ఉన్నాడు.
5 troops were injured today due to fratricide committed by Ct Satteppa SK at HQ 144 Bn Khasa, Amritsar. Ct Satteppa S K was also injured. Out of the 6 injured, 5 troops incl Ct Satteppa, have lost their lives, one critical. A court of inquiry has been ordered: BSF pic.twitter.com/d17FzAdFkl
— ANI (@ANI) March 6, 2022
బడ్జెట్ సమావేశాల్లో ప్రజాసమస్యలను తెలుసుకోవడం ఈ సారి పార్టీ నేతలతో సమావేశం పెట్టామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చించడం కోసమే ఈ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం తూ తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రయత్నిస్తోంది
గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
సభ ప్రొరోగ్ జరగలేదని చెప్పడం.. సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం
ఇన్ని రోజులు పొరోగ్ చేయలేదంటేనే రాజ్యాంగ అపహాస్యం చేయడమే.
గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే..
గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా .. ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం ఉండేది. అది మేము కోల్పోయాం
ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ.700 మేర భారీగా ఎకబాకింది. 2022లో గరిష్ట ధరలను నమోదుచేసింది. పసిడి బాటలోనే పయనిస్తూ వెండి ధర భగభగ మండుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.760 మేర పెరగడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,800కి చేరింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.900 మేర పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,400 కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముందు కేజీ వెండి ధర దేశంలో రూ.68 వేలుగా ఉండేది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. విజయవాడలో రూ.700 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 6th March 2022) పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400కి ఎగబాకింది. విజయవాడలో వెండిపై రూ.900 పెరగడంతో 1 కేజీ ధర రూ.73,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ఇదే ధరలో ట్రేడింగ్ అవుతోంది. విశాఖపట్నం, తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటర్ రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్ ధర రూ.94.34 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 6th March 2022)పై 20 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.71 కాగా, ఇక్కడ డీజిల్ పై 18 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.77 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 31 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.36 అయింది. డీజిల్‌పై 29 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.47 కు చేరింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని, దీని ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట ప్రస్తుతం 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బంగాళాఖాతంలో మార్చి నెలలో 28 ఏళ్ల తరువాత అల్పపీడనం గానీ, వాయుగుండం ఏర్పడ్డాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 1994 మార్చి 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడ్డాయి. ఈ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటాన్ని అరుదైనది విషయమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో దక్షిణ కోస్త్రాంధ్ర, రాయలసీమలో నేడు వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. చిత్తూరు, అనంతరపురం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని చోట్ల బలమైన గాలులు వీచడంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణంలో స్వల్ప మార్పులు జరుగుతాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు ఉండగా, పగటిపూట గరిష్టంగా ఒకట్రెండు చోట్ల 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!